aishwarya rajesh : సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకి అంతగా ఎంకరేజ్ మెంట్ ఉండదనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో అడపాదడపా తెలుగమ్మాయిలు సత్తా చాటుతున్నారు. పొరుగు రాష్ట్రాల వారికంటే మేము దేనిలో కూడా తక్కువ కాదని ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్దమవుతున్నారు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేయడానికైనా, బోల్డ్ పాత్రల్లో మెప్పించడానికైనా వెనకాడటం లేదు. ఈషారెబ్బ, ఐశ్వర్య రాజేశ్ ఈ మధ్య బాగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే పాత్రల్లో నటించడానికి ముంబై హీరోయిన్స్ కంటే ముందుంటున్నారు. కొన్ని పాత్రలను వారి వరకు వెళ్ళకుండా ఒడిసిపట్టి అవకాశాలను అందుకుంటున్నారు.

అంతేకాదు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూనే రెమ్యునరేషన్ కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ లేకపోయినా పరభాషా నటీమణులకి అడిగినంత రెమ్యునరేషన్ ముట్టచెబుతున్నారు. అలాంటప్పుడు మాకేందుకు ఇవ్వరనేది కూడా మన తెలుగమ్మాయిలకి ఉన్న ఆలోచన. ఇందులో తప్పు లేదనేది కూడా ఇండస్ట్రీ వర్గాలలో కొందరి మాట. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్ తను కమిటయ్యే సినిమాలకి గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. దాంతో తమిళ నిర్మాతలు షాకవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. శైలజా కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్ లో ఈమె బాగా పాపులర్ అయింది.
aishwarya rajesh : క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా.
ఇప్పుడు నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. ఈమెకి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో బాగానే క్రేజ్ ఉంది. నేచురల్ పర్ఫార్మర్ గా ప్రేక్షకుల నుంచి, ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అందుకే రెమ్యునరేషన్ హై రేంజ్ లో అడుగుతుందట. పూజా హెగ్డే, రష్మిక మందన్న, సాయి పల్లవిల రెమ్యునరేషన్ 2.5 కోట్లు నుంచి 3 కోట్ల వరకు ఉందని టాక్. అయితే ఐశ్వర్య రాజేశ్ రెమ్యునరేషన్ అంత డిమాండ్ చేయకపోయినా తన రేంజ్ కంటే ఎక్కువగానే కావాలంటుందట. హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ. రెండు ఫ్లాపులు పడితే ఎవరూ పట్టించుకోరు. కాబట్టి హీరోయిన్ గా క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా అని సన్నిహిత వర్గాల వద్ద ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది.