Akhil : అఖిల్ – పూజా హెగ్డేల జంటగా రూపొందుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించాడు. ‘మనం’ సినిమా క్లైమాక్స్ లో చిన్న గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన అఖిల్.. అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రేక్షకుల్లో కూడా ఆ కొద్దిసేపు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. కొన్ని నిముషాలకే అభిమానుల్లో ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే అఖిల్ పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తే ఇంకెలా ఉంటుందో అని అందరూ చెప్పుకున్నారు.
ఇక అఖిల్ అన్న టైటిల్ తో మొదటి సినిమా చేసిన అఖిల్ పెద్దగా మెప్పించలేకపోయాడు. నితిన్ నిర్మాతగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ ఫ్లాప్ సినిమాగా మిగిలింది. అయినా వెంటనే మరో రెండు సినిమాలు చేశాడు. విక్రం కుమార్ దర్శకత్వంలో హలో .. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ఞు ఈ రెండు సినిమాలు అఖిల్ కి సక్సస్ ని ఇవ్వలేకపోయాయి. కాగా అఖిల్ కెరీర్ లో నాలుగవ సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న రొమాంటిక్ సినిమాతో రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
Akhil : అఖిల్ కి ఫస్ట్ హిట్ అకౌంట్ లో చేరినట్టే.
ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డే ల మధ్యన ఉన్న రొమాంటిక్ సీన్స్ సినిమాకి బాగా ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నారు. యూత్ ఆడియన్స్ కోసమే అన్నట్టుగా ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్స్ సినిమా సక్సస్ కి ప్రధాన కారణం అవుతాయంటున్నారు. ఇప్పటికే పోస్టర్స్ సినిమా మీద బాగానే అంచనాలు పెంచాయి. ఈ సినిమా గనక హిట్ అయితే అఖిల్ కి ఫస్ట్ హిట్ అకౌంట్ లో చేరినట్టే. కాగా అఖిల్ నెక్స్ట్ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!