Ananya pande : అనన్య పాండే..బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా హిందీ ఇండస్ట్రీలో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తో ఏకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది. పూరి జగన్నాథ్ ఒక హీరోయిన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడంటే మేకర్స్ తో పాటు హీరోల దృష్టి గట్టిగానే పడుతుంది. అంత క్రేజ్ ఉండేలా పూరి ..తన సినిమాలలో హీరోయిన్ ని చూపిస్తాడు. తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్ ద్వారా తెలుగు తెరకి కేతిక శర్మ పరిచయం అవుతోంది.
ఇప్పటికే ఈ బ్యూటీ చేతిలో వైష్ణవ్ తేజ్ సినిమా ఉంది. అలాగే మరో సినిమాకి సైన్ చేసిందని సమాచారం. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి కూడా మూడు సినిమాలతో టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. కానీ ఇంకా అనన్య పాండే మాత్రం ఇంకా టాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహర్ – పూరి జగన్నాథ్ – ఛార్మి నిర్మిస్తున్నారు.
Ananya pande : అనన్య పాండే చేతిలో సినిమాలు ఉండాల్సింది.
దాదాపు 120 కోట్లతో లైగర్ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈపాటికే అనన్య పాండే చేతిలో సినిమాలు ఉండాల్సింది. మరి ఇంకా ఎందుకు అవకాశాలు రావడం లేదని మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. అయితే టీజర్ లేదా ట్రైలర్, సింగిల్స్‌తో అనన్య మీద క్రేజ్ తీసుకు రావడం గ్యారెంటీ అంటున్నారు. చూడాలి మరి అనన్య కి టాలీవుడ్ లో అవకాశాలు ఏమాత్రం వస్తాయో. కాగా ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుండగా విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు.