న్యూస్ సినిమా

లైగర్ ఫెయిల్ కావడానికి అనన్యనే కారణమా.. ఏకిపారేస్తున్న విజయ్ ఫ్యాన్స్..!

Share

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా రిలీజ్ కోసం పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులందరూ ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడి ఈ రోజే లైగర్ సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ప్రీమియం షో నుంచే నెగిటివ్ టాక్‌ని మూటగట్టుకుంది. అసలు ఈ సినిమా ఫెయిల్యూర్‌కి కారణం ఏంటా అని ప్రేక్షకులందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో మొదటిగా కనిపించేది అనన్య పాండే పేరు. ప్రస్తుతం ఎక్కడ చూసినా లైగర్ సినిమాకు సంబంధించిన రివ్యూలే కనబడుతున్నాయి. వాటిలో చాలామంది ఒకే రకమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు మాత్రమే సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.

అనన్యనే ఫెయిల్యూర్‌కి కారణం

అసలు ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం హీరోయిన్ అనన్య పాండే అని కొందరు ఇప్పుడు ఆమెని టార్గెట్ చేసారు. అనన్యని హీరోయిన్‌గా ఎలా సెలెక్ట్ చేశారు? విజయ్ పక్కన ఆమె సెట్ కాలే, ఇది వరస్ట్ ఛాయస్ అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా లైగర్ సినిమాలోని ఒక్కొక్క పాత్రను పరిశీలించి మరీ మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో రామకృష్ణ పాత్రలో నటించిన విజయ్ దేవరకొండకు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. పూరి జగన్నాథ్ కష్టానికి, విజయ్ దేవరకొండ నటనకి ప్రతిఫలం లేకుండా చేసింది అనన్య పాండే అని.. ఆమెనే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అని ప్రేక్షకులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

ఓవర్ యాక్టింగ్ తప్ప యాక్టింగే రాదు

“మన తెలుగు హీరోల పక్కన బాలీవుడ్ హీరోయిన్లను ఎందుకు? వారికి అసలు నటించడమే రాదు. అనన్య పాండే యాక్టింగ్ చేయడం పక్కనపెట్టి ఓవరాక్టింగ్ చేసింది, సినిమా చూసే ఆడియన్స్ అందరికీ నిద్ర వచ్చేలా చేసింది ఆమె నటన” అని మరికొందరు అనన్యపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.

 


Share

Related posts

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

somaraju sharma

ఆ జనసేన కీలక నేత కూడా పక్క చూపులు చూస్తున్నారా?

Yandamuri

న‌వీన్ చంద్ర `28°c`

Siva Prasad