Anushka shetty: అనుష్క శెట్టికి అవకాశాలు ఇవ్వడం లేదా..సైజ్ జీరో కోసం చేసిన రిస్క్ ఆమె లైఫ్‌నే తలకిందులు చేసిందా..?

Share

Anushka shetty: టాలీవుడ్‌లో మాత్రమే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎలాంటి వెలుగు వెలిగిందో అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి బాలీవుడ్ రేంజ్ హీరోయిన్ అని ఈ సినిమాలో బైక్ రైడింగ్, ఫైట్స్, స్టంట్స్ చేసి నిరూపించింది. అనుష్క హైట్‌కి నిజంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వేరే రేంజ్‌లో స్టార్ డం తెచ్చుకునేది. కానీ టాలీవుడ్‌లోనే అనుష్క శెట్టికి ఖాళీ లేకుండా సినిమాలు చేసే అవకాశం దక్కింది. కెరీర్ ప్రారంభం నుంచే అనుష్క శెట్టి మంచి కమర్షియల్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది.

is anushka-shetty-not getting chances due to size zero
is anushka-shetty-not getting chances due to size zero

స్టార్ హీరోలతో రొమాన్స్ చేయడానికి అనుష్క ఎప్పుడు నో చెప్పలేదు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అనుష్క ఒప్పుకుంది. టాలీవుడ్‌లో నాగార్జునకి మంచి హిట్ పెయిర్‌గా అనుష్క నిలిచింది. బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి స్టార్స్‌తో నటించింది. మెగాస్టార్ చిరంజీవితో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసి ఆకట్టుకుంది. వేదం లాంటి సినిమాలో బోల్డ్ పాత్ర చేసేయడానికి వెనకాడలేదు. అనుష్క అంటే ప్రయోగాలను చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉండే హీరోయిన్ అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకున్నారు. ఇక ప్రభాస్ – అనుష్క పెయిర్ అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ మరో రేంజ్.

Anushka shetty: బిల్లా సినిమాలో అనుష్క బికినీ వేసిన అందరికీ విపరీతంగా నచ్చింది.

బిల్లా సినిమాలో అనుష్క బికినీ వేసిన అందరికీ విపరీతంగా నచ్చింది. అలా అనుష్క కొన్ని క్యారెక్టర్స్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయింది. అనుష్క కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అంటే అరుంధతి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో అనుష్క మార్కెట్ స్టార్ హీరో రేంజ్‌లో పెరిగింది. ఆ సినిమా అనుష్క తప మరెవరు చేసిన డిజాస్టర్ అనే టాక్ కూడా వినిపించింది. అయితే అరుంధతి తర్వాత అనుష్క కెరీర్ బ్యాలెన్స్డ్‌గా సినిమాలు ఒప్పుకోవడంలో కొన్ని పొరపాట్లు చేసింది. మొహమాటానికిపోయి ఏకంగా తన కెరీర్‌నే పణంగా పెట్టింది.

సైజ్ జీరో లాంటి సినిమా ఒప్పుకొని అనుష్క ఎంత పెద్ద పొరపాటు చేసిందో ఆ తర్వాత తెలిసింది. సైజ్ జీరో కోసం తన ఫిక్స్‌లో వచ్చిన భారీ ఛేంజ్ వల్ల సినిమా అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. బాహుబలి సినిమా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మళ్ళీ తన ఫిజిక్ నార్మల్ స్టేజ్‌కి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాని వల్ల కొన్ని సినిమా అవకాశాలను కోల్పోయింది. వరుసగా సినిమాలు చేయలేకపోయింది. భాగమతి సినిమా చేసింది కానీ ఆశించిన భారీ హిట్ అందుకోలేకపోయింది.

Anushka shetty: నిశ్శబ్ధం సినిమాతో ప్రయోగం చేసి దెబ్బ తినింది.

ఇంత జరిగినా మళ్ళీ నిశ్శబ్ధం సినిమాతో ప్రయోగం చేసి దెబ్బ తినింది. ఈ సినిమాలో మూగ, చెవిటి పాత్రలో నటించడం వరకు ఒకే గానీ సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ సినిమా తర్వాత అధికారకంగా ఇప్పటి వరకు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. జాతి రత్నాలు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఓ మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ చేస్తుందనే టాక్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇంకా దీనికి సంబంధించిన ప్రకటన రాలేదు. అయితే ఈ కథ మన తెలుగు వాళ్ళకి ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనేది లోలోపల ఓ నెగిటివ్ టాక్ సాగుతోందట. చూడాలి మరి సినిమాలకి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే మాత్రం ఇకపై తనకున్న అనుభవంతో మంచి కథలను ఎంచుకుంటుందో మళ్ళీ రాంగ్ స్టెప్స్ వేస్తుందో.


Share

Related posts

Big Boss Fame Hema : వామ్మో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూతురు ఇంత అందంగా ఉందా… సలోని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా..?

Teja

కరోనా ఉన్నా TCS ముందడుగు.. భారీ ఎత్తున కొత్త ఉద్యోగాలు

Muraliak

రాజధాని గ్రామాల్లో నందమూరి సుహాసిని

somaraju sharma