Raviteja: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ఖిలాడి. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతీ లాల్ గడ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా పలు వాయిదాలు తర్వాత ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్ మంచి హైప్ క్రియేట్ చేశారు. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఖిలాడి సినిమాకు భారీగానే జరిగింది. అయితే, ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులన్నీ కాస్త సద్దుమణుగుతుండటంతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

కాగా, తెలంగాణాలో కోవిడ్ ఆంక్షలు ప్రస్తుతం లేనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా నైట్ కర్ఫ్యూ అలాగే 50 పర్సంట్ ఆక్యుపెన్సీ నిబంధనలు కొనసాగుతున్నాయి. ఈ ఆక్యుపెన్సీ అనేది రవితేజ సినిమాకు పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది ‘క్రాక్’ సినిమా రిలీజ్ సమయంలో కూడా యాభై శాతం సీటింగ్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి రవితేజకు మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది. కానీ, నైట్ కర్ఫ్యూ అనేది మాత్రం కచ్చితంగా ఇబ్బందులు పెడుతుంది. ఇదే ఇప్పుడు అక్కడ మాస్ మహారాజా ఖిలాడికి వసూళ్ళ పరంగా గట్టి దెబ్బపడుతుందని చెప్పుకుంటున్నారు.
Raviteja: ఖిలాడి హిందీ వెర్షన్ విషయంలో జరగలేదు.
ఈ సినిమాలో హీరోయిన్స్‌గా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ నటించారు. అనసూయ, అర్జున్ సర్జా ఇందులో కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఖిలాడి సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇది రవితేజ హిందీ ఫస్ట్ మూవీ. అయితే, అక్కడ ప్రమోషన్స్ మాత్రం ఇంకా నిర్వహించలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో హిందీ మార్కెట్ మీద మాస్ మహారాజ రవితేజ..ప్రభాస్, అల్లు అర్జున్‌ల మాదిరిగా గ్రిప్ తెచ్చుకుంటారా లేదా అనేది త్వరలో తేలిపోతుంది. ఎందుకంటే ఏ సినిమాకైనా కాస్తో కూస్తో ప్రమోషన్ చేసి సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాలి. అది ఖిలాడి హిందీ వెర్షన్ విషయంలో జరగలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్ అంటూ మాస్ డైలాగ్‌తో రవితేజ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆటం బాంబ్‌లా పేలింది.