Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా చిత్రీకరణ చేరుకుంది. బోయపాటి శ్రీను – బాలయ్యల కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే సింహా, లెజెండ్ చిత్రాలలో వరుసగా భారీ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ మీద రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే బోయపాటి భారీ స్థాయిలో బాలయ్య రెండు క్యారెక్టర్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు. ఇప్పటికే అఖండ మీద పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేసి అసాధారణమైన అంచనాలను పెంచాడు బోయపాటి.
కాగా అఖండ తర్వాత మరో ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టిన బాలయ్య త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. త్వరలో అఖండ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్నీ భారీ సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సోలో డేట్ ఏదైనా చూసుకొని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్ – పూర్ణ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Balakrishna : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ అక్టోబర్ 1 నుంచి
కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్నారట. త్వరలో ఇందులో నటించే హీరోయిన్ సహా ఇతర నటీ నటులు, టెక్నీషియన్స్ కి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారట. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు బాలయ్య.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?