Sai pallavi: టాలెంటెడ్ హీరోయిన్..ఫిదా బ్యూటీ సాయి పల్లవి – రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా విరాట పర్వం. ఈ సినిమా గత ఏడాది నుంచి అప్పుడు ఇప్పుడు రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ రిలీజ్ చేసేందుకు మాత్రం వీలుపడటం లేదు. మధ్యలో విరాట పర్వం సినిమాను నారప్ప, దృశ్యం 2 చిత్రాల మాదిరిగా ఓటీటీలో రిలీజ్ చేసారనే ప్రచారమూ జరిగింది. దాంతో స్వయంగా దర్శకుడు వేణు ఉడుగుల క్లారిటీ ఇస్తూ ఈ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయనున్నామని తేల్చి చెప్పాడు. అలా చెప్పినప్పటి నుంచి అందరూ విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మధ్య కొత్తగా ఓ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి బాగా వైరల్ అయింది. రిలీజ్ డిలే అవుతున్న విరాట పర్వం సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా తర్వాత రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. చాలా నెలలుగా విరాట పర్వం సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. దాంతో కొంత జనాలలో ఈ సినిమా మీద ఆసక్తి సన్నగిల్లింది. ఇలాంటి సమయంలో భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటికే భారీ అంచనాలతో చెప్పుకుంటున్నారు.
దాంతో ఆ సినిమా తర్వాత రానా క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతుందనే మేకర్స్ ప్లాన్‌తో విరాట పర్వం సంక్రాతి తర్వాత రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆమె పాత్ర ఉద్యమకారిణి కాబట్టి ఇటీవల కొందరు ఉద్యమకారులు సాయి పల్లవి పాత్రను వక్రీకరించారని ఆ పాత్రను మార్చాలని పట్టుపట్టారట. అందుకే ఇప్పుడు ఆ పాత్రలో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు విరాట పర్వం రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…