Manchu vishnu: మోసగాళ్ళు సినిమా చేసి మోసపోయిన మంచు విష్ణు..ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..!

Share

Manchu vishnu: ప్రస్తుతం మన టాలీవుడ్‌లో సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమాల హడావుడి ఎక్కువైంది. ఏమంటూ రాజమౌళి బాహుబలి సినిమాలను తీసి మన తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చి సత్తా చూపించారో అప్పటి నుంచి దాదాపు అందరు హీరోలు పాన్ ఇండియన్ సినిమా వెనకాల పరుగులు పెడుతున్నారు. కథ ఎలా ఉన్నా దానిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి అవసరం ఉన్నా లేకపోయినా నాలుగైదు భాషల్లో రిలీజ్ చేసి దెబ్బతింటున్నారు. అన్నీ కథలు పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించడానికి పనికిరావు.

is because of this reason manchu-vishnu movie mosagallu got flop
is because of this reason manchu-vishnu movie mosagallu got flop

కానీ ప్రతీ హీరోకి ప్రభాస్ రేంజ్‌లో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ కావాలి. అందుకే అందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అంటూ మోచేతులవరకు కాల్చుకుంటున్నారు. గత మూడు నాలుగేళ్ళుగా సరైన హిట్ లేని మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని మోసగాళ్ళు సినిమాను భారీగా ప్లాన్ చేశాడు. ఈ సినిమాతో తనూ ప్రభాస్ రేంజ్‌లో పాన్ ఇండియన్ స్టార్‌గా పాపులారిటీ తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కథను ఎంచుకున్నాడు.

Manchu vishnu: మంచు విష్ణుకు ఊహించని విధంగా షాకిచ్చింది.

సాంకేతిక కుంభకోణాలకు సంబంధించిన నిజమైన సంఘటనల ఆధారంగా తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా రూపొందించారు. మంచు విష్ణు కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్ సినిమా. దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో మోసగాళ్ళు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసే దర్శకుడిగా ఆయనను ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. మంచు విష్ణుకు ఊహించని విధంగా షాకిచ్చింది.

దాంతో మంచు విష్ణు మోసగాళ్ళు సినిమాతో మోసపోయాడని సినిమా రిజల్ట్ చూసి కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు అభిమానులు చెప్పుకున్నారు. ఈ సినిమా ఇంత భారీ నష్ఠాలను మిగల్చడానికి కారణాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ముందుగా దర్శకుడి గురించి చెప్పాలంటే కథను సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. ఇక ఇందులో క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంచు విష్ణుకు సోదరిగా నటించడం. ఇది సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఈ విషయంలో సినిమా రిలీజ్‌కు ముందు నుంచి జనాలను ట్యూన్ చేయడానికి ట్రై చేశారు.

Manchu vishnu: కాజల్‌ను మంచు విష్ణు సోదరిగా అంటే చూడలేకపోయారు.

కానీ జనాలు కాజల్‌ను మంచు విష్ణు సోదరిగా అంటే చూడలేకపోయారు. ఇక నిర్మొహమాటంగా చెప్పాలంటే సినిమా స్క్రీన్ ప్లే మాత్రమే కాదు ఈ కథ పాత సినిమాలను తలపించేదిగా ఉండటంతో పాటు విష్ణు ఇందులో ఏమాత్రం సూటవలేదని కామెంట్ చేశారు. అసలు ఏముందని ఈ కథను సినిమాగా తీశారు. పైగా ఇంగ్లీష్ భాషలో కూడా అని వెటకారంగానూ మాట్లాడుకున్నారు. సునీల్ శెట్టి లాంటి బాలీవుడ్ హీరోలు కూడా నటించిన మోసగాళ్ళు ఒకే ఒక్క షోతో జనాలు ఫ్లాప్ అని డిసైడ్ చేసేశారు. కనీసం డివైడ్ టాక్ వస్తేనైనా కొంతవరకు ఆడేదేమో. ఇకపై మంచు విష్ణు మాత్రమే కాదు ఇలాంటి కథలతో ఏ హీరో సాహాసం చేయరు.


Share

Related posts

Shammi Plant: ఈ ఆకు రుద్దిన తర్వాత అవాంచిత రోమాలు ఉండవు..!!

bharani jella

బ్రేకింగ్: నిమ్మగడ్డ ప్రెస్ మీట్?

CMR

‘వైసిపి బాధితుల తరలింపుకు చర్యలు’

somaraju sharma