Bhavana: ఒంటరి హీరోయిన్ భావన రీ ఎంట్రీ..సీనియర్ హీరోతో ఛాన్స్.?

Share

Bhavana: టాలీవుడ్‌లో కేవలం మూడు సినిమాలు చేసిన భావన ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమె టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. చాలామంది హీరోయిన్స్ మధ్యలో సినిమాలకు దూరమై మళ్ళీ మంచి ఆఫర్స్ రావడంతో అక్కగానో,వదినగానో పాత్రలను అంగీకరించి రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా బాగానే రాణిస్తున్నారు. అయితే ప్రియమణి మాదిరిగా సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు మాత్రం కొందరికే దక్కుతాయి. ఇక కొంతమంది హీరోయిన్స్ ఏజ్ ఎక్కువవుతున్న మంచి ఫిజిక్ అండ్ గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ హీరోయిన్ ఛాన్సెస్ కోసమే ట్రై చేస్తుంటారు.

is bhavana-re-entry with senior hero...?
is bhavana-re-entry with senior hero…?

భావన కూడా ఇప్పుడు అలాంటి అవకాశాల కోసమే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భావన తెలుగులో మాచో హీరో గోపిచంద్ నటించిన ఒంటరి సినిమాతో పరిచయమైంది. 2008లో వచ్చిన ఈ సినిమాకు బి.వి.రమణ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈతరం ఫిలింస్ బ్యానర్‌పై పోకూరి బాబూరావు నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఒంటరి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే ఏడాది యంగ్ హీరో నితిన్ నటించిన హీరో సినిమాలో నటించింది.

Bhavana: రెండు సినిమాలు ఫ్లాపయినా కూడా భావన మీద క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దృష్ఠి పడింది.

ఈ సినిమా కూడా భావనకి హిట్ ఇవ్వలేకపోయింది. మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో మన్యం రమేష్ నిర్మించారు. యాక్షన్ కామెడీ సినిమాగా రూపొందిన దీనికి జీవీ సుధాకర్ నాయుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది. ఇదే మూవీ మలయాళంలో ‘పోలీస్ అకాడమీ’ పేరుతో, హిందీలో ‘లాడెంగే హమ్ మార్టే దమ్ తక్’ పేరుతో డబ్బింగ్ చేశారు. ఎక్కడా ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాపయినా కూడా భావన మీద క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దృష్ఠి పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన మహాత్మ సినిమాలో భావనను హీరోయిన్‌గా తీసుకున్నారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. నటుడిగా శ్రీకాంత్‌కు మహాత్మ 100వ సినిమా. అందుకే కృష్ణవంశీ ఈ మూవీని చాలా ప్రత్యేకంగా భావించి తీశాడు. కానీ ప్రేక్షకులు మహాత్మ సినిమాను ఆదరించలేదు. ఈ సినిమా తర్వాత భావన టాలీవుడ్‌లో మళ్ళీ కనిపించలేదు. ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ ఆమెకు అవకాశాలు రాకుండా చేశాయి.

Bhavana: బాలకృష్ణ సినిమాతో మళ్ళీ భావన రీ ఎంట్రీ

మొత్తంగా 70 సినిమాల వరకు చేసిన భావన కన్నడ, తమిళం, మలయాళ భాషలలో మంచి హిట్స్ అందుకున్నారు. కానీ తెలుగులోనే ఆమెకు హిట్స్ దక్కలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ సినిమాతో మళ్ళీ భావన రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతి హాసన్ ఓ హీరోయిన్‌గా ఎంపికైందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో హీరోయిన్‌గా ఈ కేరళ కుట్టిని తీసుకోనున్నారట. క్రాక్ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలో భావన రీ ఎంట్రీకి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది.


Share

Related posts

బిగ్ బ్రేకింగ్ : భూమా అఖిలప్రియ కి జీవిత ఖైదు ??

somaraju sharma

NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ..?

GRK

Harish Rao: పుట్టిన‌రోజున హ‌రీశ్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం… వైర‌ల్ అవుతున్న ప్ర‌క‌ట‌న‌

sridhar