Pushpa : స్టైలిష్ కాస్త పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. స్టైల్ లో అల్లు అర్జున్ రూటే వేరు. ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించడమే కాదు తన ప్రతీ సినిమాలో పూర్తి భిన్నమైన మేకోవర్ తో కనిపించడానికి ట్రై చేస్తుంటాడు. అయితే మొదటిసారి ఊరమాస్ గేటప్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ మేకోవర్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పాన్ ఇండియా సినిమాగా 5 భాషలలో రిలీజ్ కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది.
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 13న ఫస్ట్ సింగిల్ దాకో దాక్కో మేక అనే పాట రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పుష్ప మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఇదే మన ఐకాన్ స్టార్ కి దెబ్బ పడే అవకాశం
ఉందని టాక్ మొదలైంది. అది కూడా బాలీవుడ్ లో.
Pushpa : అల్లు అర్జున్ అమీర్ ని ఎదురుకుంటాడా..?
ఎందుకంటే అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ డెబ్యూ బాలివుడ్ సినిమా పుష్ప. అయితే అదే క్రిస్మస్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దాను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో మన టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా క్రిస్మస్ బరిలో అమీర్ – నాగ చైతన్యల లాల్ సింగ్ చద్దా వంటి భారీ సినిమా ఉంటే బాలీవుడ్ లో పుష్ప సినిమాకు గట్టి పోటీ కానుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మరి అల్లు అర్జున్ అమీర్ ని ఎదురుకుంటాడా లేదా అనేది తెలియాలంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగేవరకు వెయిట్ చేయాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?