F-3 : ఎఫ్-2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద దర్శకుడు అనిల్ రావిపూడి ఎలాంటి సక్సస్ ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఎఫ్-2 లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో నవ్వులు పూయించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. కాగా ఇప్పుడు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డబుల్ డోస్ తో.. ఎఫ్-3 తెరకెక్కుతోంది. అయితే.. ఎఫ్-3 సినిమాని ప్రకటించినప్పటి నుంచి మూడో హీరో ఉండబోతున్నాడనే ప్రచారం సాగింది.
ఆ మూడో హీరో మాస్ మహారాజ రవితేజ అని.. సూపర్ స్టార్ మహేష్ బాబు అని ప్రచారం సాగింది. మధ్యలో సాయి ధరం తేజ్ పేరుతో సహా..కమెడియన్ సునీల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆ తర్వాత ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే..ఈ సినిమాలో మూడవ హీరోకి అవకాశం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఎఫ్-3 ఆగస్టు 27వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఎఫ్-2 లో నటించిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.
F-3 : ఎఫ్-3 సినిమాలో సోనాల్ చౌహాన్..?
అయితే తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ బాలీవుడ్ లో ఇంతక ముందు మంచి క్రేజ్ సంపాదించుకున్న సోనాల్ చౌహాన్ అని తెలుస్తోంది. సోనాల్ చౌహాన్ తెలుగులో బాలయ్యతో వరసగా సినిమాలు చేసింది. మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా సోనాల్ చౌహాన్ కి మంచి పేరుందు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ నుంచి క్లారిటీ లేనప్పటిని ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మందిస్తున్నాడు. దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు.