Varun tej : మెగాప్రిన్స్‌గా వరుణ్ తేజ్ టాలీవుడ్లో ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా ముకుంద నుంచి గత చిత్రం గద్దల కొండ గణేశ్ వరకు ప్రతీ కథను ఎంతో వైవిధ్యంగా ఎన్నుకుంటూ టాలీవుడ్లో స్టార్ డం తెచ్చుకున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోలు ప్రయోగాలకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారనడానికి వాళ్ళు ఎంచుకునే విభిన్నమైన కథాంశాలే సాక్ష్యం. ముఖ్యంగా వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలనే చేయాలన్న గిరి గీసుకోకుండా అన్నీ రకాల కథలను ..అన్నీ రకాల జోనర్స్ ని టచ్ చేయడం చూస్తూనే ఉన్నాము. వాస్తవంగా వరుణ్ కటౌట్ చూస్తే బాలీవుడ్ హీరోలా ఉంటుంది.
ఆయన సినిమాలన్నీ బాలీవుడ్లో చేస్తే మంచి హిట్స్‌గా నిలుస్తాయి కూడా. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు బాలీవుడ్ తరహాలో ఉండేవే. బాలీవుడ్లో ఎక్కువగా ఫన్ రైడర్ లాంటి సినిమాలు తెరకెక్కుతుంటాయి. మల్టీస్టారర్ సినిమాలలో ఎక్కువగా ఫన్ అండ్ ఎంటర్టైనర్స్ వచ్చి భారీ హిట్స్ అందుకుంటుంటాయి. అలాంటి సినిమానే వరుణ్ తేజ్ వెంకటేశ్ తో కలిసి చేస్తున్నాడు. అదే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది.
Varun tej : వరుణ్ తేజ్ హిందీ – తెలుగులో రూపొందనున్న సినిమాకి సైన్ చేశాడట.
ఇక గని అనే సినిమా ఒకటి చేస్తున్నాడు. ఇది బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఒక డెబ్యూ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ హిందీ – తెలుగులో రూపొందనున్న సినిమాకి సైన్ చేశాడట. ప్రస్తుతం ఆ యంగ్ డైరెక్టర్ పేరు రివీల్ చేయలేదు. స్క్రిప్ట్ వరుణ్ కి బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సోని పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా వరుణ్ ఓకే చేశాడట. అందులో ఒకటి పాన్ ఇండియన్ సినిమాగా మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. త్వరలో వీటికి సంబంధించిన అధికారకమైన ప్రకటనలు రానున్నట్టు సమాచారం.