Megastar : మెగాస్టార్ సరసన హీరోయిన్ అంటే అంత సులభంగా సెట్ అవడం కష్టం. ఆయన రేంజ్ కి ఏజ్ కి తగ్గట్టు హీరోయిన్స్ అంటే టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. సీనియర్ హీరోయిన్స్ లో నయనతార, తమన్న, కాజల్ అగర్వాల్ ఇప్పటికే నటించేశారు. ఆచార్య సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మే 13న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత మలయాళ హిట్ సినిమా లూసీఫర్ లో నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఈ సినిమా పూర్తి కాగానే మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. లూసీఫర్ సినిమాకి సంబంధించి మెగాస్టార్ షూట్ కంప్లీట్ అవ్వడమే తోనే వేదాలం తెలుగు రీమేక్ ని సెట్స్ మీదకి తీసుకు రానున్నారు. మెహర్ రమేష్ ఇప్పటికే స్క్రిప్టు కూడా పక్కాగా రెడీ చేసి పెట్టుకున్నాడు. అలాగే మరో యంగ్ దర్శకుడు కె.ఎస్. రవీంద్రతో ఒక సినిమా చేయనున్నారు చిరు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
Megastar : బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ సోనాక్షి సిన్హా.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ సోనాక్షి సిన్హా. సీనియర్ హీరోలకి బాగా సూటవుతుంది. అందుకే మెగాస్టార్ కి జంటగా సోనాక్షి ని నటినంప చేయాలని భావిస్తున్నారట. డేట్స్ కోసం మేకర్స్ సోనాక్షి ని సంప్రదించడానికి ముంబై వెళుతున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మెగాస్టార్ సినిమాతో టాలీవుడ్ లో సోనాక్షి అడుగు పెట్టనుందని సమాచారం.