Uppena : సుకుమార్ అసోసియేట్ గా దర్శకత్వ విభాగంలో పనిచేసి ఉప్పెన చిత్రం తో డైరెక్టర్ అయ్యాడు. డెబ్యూ సినిమా అయినా మూడు, నాలుగు సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా ఉప్పెనని తెరకెక్కించాడు. మైత్రీ మూవీస్ లాంటీ పెద్ద సంస్థ తో కలిసి సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ కూడా కలిసి ఈ సినిమాని 20 కోట్ల బడ్జెట్ కేటాయించి నిర్మించారని అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో కాబట్టి అందరిలో కూడా బాగానే బజ్ క్రియేట్ అవడం అంచనాలు కూడా స్కై రేంజ్ లో ఎదగడం సినిమాకి బాగా కలిసి వచ్చి సూపర్ హిట్ అయింది.
కృతి శెట్టి కి ఇదే మొదటి సినిమా అనే భావన కలగకుండా బాగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా వరుసగా ఈమెకి అవకాశాలు తెచ్చి పెట్టేలా సక్సెస్ ఇచ్చింది. చిరంజీవి ఉప్పెన సినిమా బాగుందని ఇది దర్శకుడి సినిమా అని కితాబులిచ్చారు. అలాంటి లెజండరీ హీరో నుంచి బుచ్చిబాబుకి ప్రశంసలు దక్కడం అంటే ఇక పెద్ద డైరెక్టర్ అయినట్టే. ఇదే క్రమంలో రెండవ సినిమాకి కథ రాసుకున్నాడు. పెద్ద హీరో ఎవరైనా నటించే ఛాన్సెస్ ఉన్నాయని దర్శకుడు బుచ్చిబాబు చె ప్పుకొచ్చాడు.
Uppena : నాగ చైతన్య హీరోగా బుచ్చి బాబు రెండవ సినిమా..?
దాంతో అయితే తారక్ గానీ లేదంటే అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య గాని హీరోగా బుచ్చి బాబు రెండవ సినిమా తెరకెక్కిస్తాడని వార్తలు జోరుగానే వచ్చాయి. కానీ పెద్ద సినిమాలకే కరోనా సెకండ్ వేవ్ దెబ్బ తినక తప్పలేదు. ఇక బుచ్చిబాబు ఎలా తప్పించుకుంటాడు. ఆయనకి దీని దెబ్బ గట్టిగా తగిలి రెండవ సినిమాకి కాస్త బ్రేక్ పడిందని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. కుదిరితే ఈ ఏడాది బుచ్చిబాబు రెండవ సినిమా ఉంటుందట. లేదంటే పరిస్థితులు చక్కబడితే వచ్చే ఏడాదే ఈయన రెండవ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి పుష్పలో భాగం అయ్యాడని సమాచారం అందుతుంది.