# RC15: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాకుండానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు బాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో భారీ క్రేజ్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు ఆయన ఏ సినిమా కమిటయినా కూడా అది పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ తన 15వ సినిమాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను దాదాపు రూ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు ఇది 50వ సినిమా.
అందుకే, దిల్ రాజు ఏ విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదట. ఒక ఇప్పటి వరకు టైటిల్ కూడా ఖరారు చేయలేదు. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచీ వర్కింగ్ టైటిల్‌గా ఆర్సీ 15 అని పిలుచుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా రైట్స్ కోసం బడా కార్పోరేట్ కంపెనీలు తెలుగు రైట్స్ అలాగే, హిందీ కోసం భారీ స్థాయిలో పోటీపడుతున్నారు. ఇంతక ముందే ఈ సినిమా హిందీ రైట్స్ ను జీ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు. హిందీ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ దక్కించుకుందని సమాచారం.
# RC15: థియేట్రికల్ రైట్స్ మాత్రం నిర్మాత దిల్ రాజు ఎవరికీ ఇవ్వలేదు.
దీని కోసం భారీ మొత్తం చెల్లిన్చినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ విషయాన్నే జాతీయ మీడియా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆర్సీ 15 హిందీకి సంబంధించి అన్ని రకాల రైట్స్‌ను దాదాపు రూ. 350 కోట్లుకు దక్కించుకున్నట్లు ఓ ప్రముఖ నేషనల్ మీడియా వెబ్ సైట్ ద్వారా ప్రకటించారు. కాగా, ఇతర భాషల శాటిలైట్ మరియు డిజిటల్, థియేట్రికల్ రైట్స్ మాత్రం నిర్మాత దిల్ రాజు ఎవరికీ ఇవ్వలేదు. ఆయనే సొంతగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!