Chatrapathi : దర్శకుడు వి వి వినాయక్ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ కి కాస్త బాగానే క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్ లోనే హిందీలో ఓ సినిమా చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే ప్రభాస్ నటించగా ఊహించని విజయాన్ని అందుకున్న ఛత్రపతి. దర్శక ధీరుడు ఈ సినిమాతో తన సత్తా టాలీవుడ్ లో బాగా తెలిసొచ్చింది. ఇటు ప్రభాస్ కెరీర్ లో కూడా ఛత్రపతి మైల్ స్టోన్ మాదిరిగా నిలిచే సినిమా. ఈ సినిమాను రీమేక్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఒకవేళ రీమేక్ చేసినా అందులో ప్రభాస్ నటిస్తాడనే భావిస్తారు.
లేదంటే ప్రభాస్ కటౌట్ బాలీవుడ్ లో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు హీరోగా రీమేక్ చేసే అవకాశాలుంటాయి. కానీ షాకింగ్ గా ఛత్రపతి హిందీ రీమేక్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కావడం కాస్త ఆసక్తికరమైన చర్చలకు దారితీశాయి. ముందు ఈ సినిమాకు సాహో సినిమాతో బాలీవుడ్ బాగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి వి వి వినాయక్ వచ్చి చేరాడు. వినాయక్ వచ్చాడంటే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అందరూ మాట్లాడుకున్నారు.
Chatrapathi : ఛత్రపతి, రీమేక్ కర్ణన్ తెలుగు రీమేక్ లతో సెట్స్ మీదకి రానున్న బెల్లంకొండ శ్రీను.
కానీ అలా జరగలేదు. కరోనా కారణంగా అన్నీ ప్రాంతాలలో షూటింగ్స్ ఆగిపోయాయి. అందుకే ఈ సినిమాకి బ్రేక్ పడింది. కానీ అందరు మొత్తానికే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అని అనుకున్నారు. అందుకే బెల్లంకొండ శ్రీను తమిళంలో ధనుష్ నటించిన కర్ణన్ సినిమా రీమేక్ చేయనున్నాడని చెప్పుకున్నారు. కానీ అందరు అనుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు..డిలే అవదు. ఇప్పటికే హైదరాబాద్ లో దీని కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతుండగా త్వరలో ఆ సెట్ లో చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. అలాగే కర్ణన్ తెలుగు రీమేక్ కూడా మొదలు పెడతాడట బెల్లంకొండ శ్రీను. ఒకేసారి ఛత్రపతి తెలుగు, రీమేక్ కర్ణన్ తెలుగు రీమేక్ లతో సెట్స్ మీదకి రానున్నాడు బెల్లంకొండ శ్రీను.