Chiranjeevi : మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఆ కింగ్ మేకర్ ..?

Share

Chiranjeevi : 10ఏళ్ళ తర్వాత ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత సైరా తో పాన్ ఇండీయన్ సినిమా చేసి పాన్ ఇండియన్ స్టార్ గానూ మారారు. అంతేకాదు యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
మెగాస్టార్. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలివ్వడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం కాస్త కూడా కాంప్రమైజ్ కావడం లేదు. పకడ్భందీగా కథ, పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ అయి అది ఆయనకి సంతృప్తినిస్తేనే సెట్స్ మీదకి వెళ్ళడానికి ఓకే అంటున్నారు.

is-chiranjeevi-god-father-is-that-king-maker
is-chiranjeevi-god-father-is-that-king-maker

ఇక కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు స్క్రిప్టులను ఓకే చేసి దర్శకులతో బౌండెడ్ స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారు. కాగా మెగాస్టార్ ఆచార్య పూర్తి చేశారు. ఇందులో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే
హీరోయిన్స్ గా, సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ తెలుగు రీమేక్ మూవీలో నటించేందుకు సిద్దమవుతున్నారు.

Chiranjeevi : ఈ రెండింటికి ఇండస్ట్రి వర్గాలలో మెగా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్  కుమార్, ఆర్ బి చౌదరి, రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 12 నుంచి ఈ మూవీ సెట్స్ మీదకి రాబోతోంది. డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్టును పక్కాగా మెగా స్టార్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కి, ఎనర్జీ కి తగ్గట్టుగా సిద్ధం చేశారు. ఈ క్రమంలో మంచి పవర్ ఫుల్ టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రెండు టైటిల్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి గాడ్ ఫాదర్, మరొకటి కింగ్ మేకర్. వీటిలో ఏ టైటిల్స్ ని చిత్రబృందం ఫైనల్ చేయనుందనేది మెగాస్టార్ బర్త్ డే అయిన ఆగస్ట్ 22న తెలియనుందని సమాచారం. ఈ రెండింటికి ఇండస్ట్రి వర్గాలలో మెగా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది.


Share

Related posts

జగన్ ఆదేశించినా కన్నెర్రజేసినా లెక్కచేయట్లేదు.. ఇదోరకం తిరుగుబాటు?

CMR

Manchu Manoj : మంచు మనోజ్ పాన్ ఇండియన్ సినిమా కూడా పోటీకి రాబోతోంది..ఎవరికి అడ్డుపడతాడో..?

GRK

మహాలక్ష్మీ ఎక్కడా తగ్గట్లేదు…

Siva Prasad