Deva katta: డైరెక్టర్ దేవా కట్టాకి సక్సెస్ ఫార్ములా తెలీదా.. ఇక అవకాశాలు దక్కడం కష్టమేనా..?

Share

Deva katta: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్నా కూడా ఎందుకనో స్టార్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకోలేకపోతారు. ఇలాంటి దర్శకులు ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలోనూ ఉన్నారు. మంచి దర్శకులు అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నా కూడా ఒక్క హిట్ కూడా భారీగా పడటం లేదు. దాంతో ఒక్కోసారి ఈ డైరెక్టర్స్‌కు బాగా గ్యాప్ కూడా వస్తోంది. అంతేకాదు ఈ నేపథ్యంలోనే కొందరు దర్శకులు అవకాశాలు రాక ఫేడవుట్ కూడా అవుతున్నారు. అలా ఫేడౌట్ అవుతాడా లేదా తెలీదు కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొని కూడా మంచి కమర్షియల్ డైరెక్టర్ గా నిలబడలేకపోతున్నాడు దేవా కట్టా.

is deva-katta-lack success formula
is deva-katta-lack success formula

వెన్నెల సినిమాతో దర్శకుడిగా దేవా కట్టా టాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ఈ సినిమా మంచి క్లాస్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రస్థానం సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సాయి కుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రలు పోషించారు. కామెడి, కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్స్ వస్తున్న సమయంలో దేవా కట్టా నుంచి ప్రస్థానం సినిమా వచ్చి అందరినీ ఆలోచింపచేసింది. ఈ సినిమా టాలీవుడ్ సినీ ప్రముఖులందరి నుంచి ప్రశంసలు అందుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా సాయి కుమార్, శర్వానంద్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడి తీసుకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్థానం సినిమా తర్వాత దేవా కట్టా నుంచి వేరే సినిమాలొచ్చినా కూడా ఇప్పటికీ ఆయన ప్రస్థానం సినిమా దర్శకుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు.

Deva katta: ఏ దర్శకుడికైనా బాలీవుడ్ లో సినిమా చేయాలని చాలా ఆసక్తి ఉంటుంది.

ఈ సినిమా తర్వాత నాగ చైతన్య, సమంతలతో ఆటో నగర్ సూర్య సినిమా తెరకెక్కించాడు. అయితే నిర్మాణంలో జాప్యం జరగడంతో రైట్ టైం లో రిలీజ్ కాక ఆటో నగర్ సూర్య అట్టర్ ఫ్లాపయింది. అయినా ఈ కథ ఆయనకి చాలా ఇష్టం. అవకాశం వస్తే ఇదే కథను మరోసారి వేరే భాషలో తెరకెక్కించాలనుకుంటున్నట్టు కూడా ఇటీవల తెలిపాడు దేవా కట్టా. ఇక డైనమైట్, సినిమా తీసి హిట్ అందుకోవాలనుకున్న ఆయనకి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా మిగిలి పెద్ద షాకిచ్చింది. ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ దేవా కట్టా ప్రస్థానం సినిమా చూసి హిందీలో డైరెక్ట్ చేసే ఆఫర్ ఇచ్చాడు. చెప్పాలంటే ఏ దర్శకుడికైనా బాలీవుడ్ లో సినిమా చేయాలని చాలా ఆసక్తి ఉంటుంది.

కానీ అందరికి ఆ అవకాశం రాదు. అదృష్టం కొద్ది దేవా కట్టాకి ఆ అవకాశం దక్కింది. అది కూడా ఆయన సూపర్ హిట్ ఇచ్చిన ప్రస్థానం సినిమా కావడం విశేషం. కానీ ఈ సినిమా బాలీవుడ్‌లో ఆశించిన సక్సెస్ సాధించలేక విమర్శలు ఎదుర్కొంది. దాంతో మళ్ళీ తెలుగులో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టి మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో రిపబ్లిక్ సినిమా తీసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమా మీద ఆయనకే కాదు నిర్మాతలకి సాయి ధరం తేజ్ అలాగే మెగా ఫ్యామీలీకి చాలా నమ్మకాలు ఉన్నాయి. కానీ రిపబ్లిక్ రిలీజ్ అయ్యాక మాత్రం అందరూ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కించుకోలేకపోయింది.

Deva katta: దేవా కట్ట ఎక్కడో తడబడ్డాడని చెప్పుకున్నారు.

దాంతో ఇప్పుడు దేవా కట్ట పరిస్థితేంటో అని మాట్లాడుకుంటున్నారట. నిజానికి రిపబ్లిక్ సినిమా కథ కథనాలు బాగానే ఉన్నప్పటికీ వాటిని తెర మీదకి తీసుకు రావడంలో దేవా కట్ట ఎక్కడో తడబడ్డాడని చెప్పుకున్నారు. కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా తీయాల్సింది అని కామెంట్స్ వినిపించాయి. నిజంగా స్క్రిప్ట్ ఇంకాస్త బాగా చేసి ఉంటే ఖచ్చితంగా రిపబ్లిక్ సినిమా భారీ కమర్షియల్ హ్యిట్ సాధించేదని అందరూ అభిప్రాయపడ్డారు. చూడాలి మరి ఇకపై దేవా కట్టా తను తీసే సినిమాల విషయంలో తన పంథా మార్చుకొని హిట్ కొట్టడానికి ట్రై చేస్తారో లేదో.


Share

Related posts

రామ్ చరణ్ సినిమా చేస్తాడనుకున్న దర్శకుడి విషయంలో మనసు మార్చుకున్నాడా ..?

GRK

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్!

Mahesh

Tragedy: కడప జిల్లాలో మరో విషాదం..! గండిమడుగులో నలుగురు గల్లంతు..!!

somaraju sharma