NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Devineni Uma: జగన్ ప్రభుత్వం నయా టార్గెట్ దేవినేని ఉమానేనా?మాజీ మంత్రి మెడకు చుట్టుకున్న మార్ఫింగ్ కేసు!!

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని ఒక న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.సీఎం జగన్  వీడియోను మార్ఫ్ చేశారంటూ సదరు న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Is Devineni Uma the new target to jagan government
Is Devineni Uma the new target to jagan government

అసలేం జరిగిందంటే!

ఈ నెల 7న ఉమ ట్వీట్ చేసిన ఓ వీడియో దుమారం రేపింది. అందులో మాటలు ముఖ్యమంత్రి జగన్ తిరుపతిని కించపరిచే ఉన్నాయి. ఎవరైనా గొప్పవాళ్ళు తిరుపతికి రావటానికి ఇష్టపడరు అంటూ తిరుపతిని ఒడిశా, బీహార్‌తో కంపార్ చేశారు. ఈ వీడియో నకిలీది అంటూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలిందని సీఐడీకి ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు అయ్యింది.

Devineni Uma: కేసులకు భయపడేది లేదు

తనపై కేసు నమోదు కావడంపై ఇటీవల దేవినేని ఉమ స్పందించారు. ప్రభుత్వ అరాచకాలను, దుర్మార్గ పాలనను ప్రశ్నించే గొంతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిపై జగన్‌ అంతరంగాన్ని బయటపెడితే తనపై సీఐడీ కేసు నమోదు చేస్తుందా అంటూ ఫైరయ్యారు. ఇలాంటి కేసులకు భయపడనని..ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. చట్టం, న్యాయ పుస్తకాలు వీడియో మార్ఫింగ్‌ లేదని చెబుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కేసులన్నీ కక్ష సాధింపు చర్యలే!

కాగా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇవి కేవలం కక్ష సాధింపు చర్యలని పేర్కొంటున్నాయి.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎవరైతే వైసిపి నేతలు గట్టిగా ఎదుర్కొన్నారు వారిని ఇప్పుడు పవర్ లోకి రాగానే ఏపీ సీఎం జగన్ టార్గెట్ చేశారని వారు చెబుతున్నారు.కోడెల శివప్రసాద్తో ప్రారంభించి ఒక్కొక్కరిగా టిడిపి నేతలను వైసిపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు.అచ్చెన్నాయుడు, జేసీ బ్రదర్స్ ,కొల్లు రవీంద్ర ,చింతమనేని ప్రభాకర్ ,పరిటాల శ్రీరామ్ తదితరులంతా ప్రభుత్వ హిట్లిస్ట్లో ఉన్నారన్నారు.వారి టర్న్ పూర్తయ్యాక తాజాగా దేవినేని ఉమను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఇందులో భాగంగానే ఆయన మీద ఈ అక్రమ కేసు బనాయించారని వారు వాపోతున్నారు.

author avatar
Yandamuri

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju