Dil raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో 50వ సినిమా కావడం విశేషం. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడిస్తూ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి రెండు శక్తుల కలయికలో ఇంతకు ముందు ఎప్పుడూ రాని హై టెక్నికల్ వ్యాలూస్ తో భారీ స్థాయిలో సినిమాను నిర్మించబోతున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అధికారకంగా వెల్లడించారు.
ఇంతక ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుందని ఎన్నో సార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన సందర్భాలుండగా ఈ ప్రాజెక్ట్ మాత్రం సాధ్యపడలేదు. ఇప్పుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో శంకర్ సినిమా రూపొందించబోతున్నాడనగానే ప్రతీ ఒకరు సంబరాలు చేసుకున్నారు.
Dil raju : దిల్ రాజు – రాం చరణ్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయినట్టేనా అని గుసగుసలు వినిపిస్తున్నాయట.
చరణ్ హీరోగా దిల్ రాజు తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటనపై ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్లు దర్శకుడు శంకర్ కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. కమల్ తో ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో తన దృష్టినంతా రామ్ చరణ్ ప్రాజెక్ట్ పైనే పెట్టాడు శంకర్. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు చెన్నై లో ఒక ఆఫీస్ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కథా చర్చలు అక్కడే సాగుతున్నాయి. అయితే తాజాగా ఇండియన్ 2 మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ వారు శంకర్ కి నోటీసులిచ్చి ఇండియన్ 2 కంప్లీట్ అయ్యే వరకు వేరే ప్రాజెక్ట్ మొదలు పెట్టకూడదని తేల్చి చెప్పారు. దాంతో దిల్ రాజు – రాం చరణ్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయినట్టేనా అని గుసగుసలు వినిపిస్తున్నాయట.