మొదటిలో బిగ్ బాస్ బ్యూటీ దివి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఛాన్స్ కొట్టేసి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించేందుకు రెడీ అవుతోందట. బిగ్ బాస్ కి వెళ్ళకముందు దివి విడిత్య చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా సైడ్ క్యారెక్టర్ గా ‘మహర్షి’ సినిమాలో గుంపులో గోవింద అన్నట్టుగా కనిపించింది. స్టార్ మా లో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తనలో హీరోయిన్ కు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది.
ఎంట్రీలోనే దివి తన కవ్వించే కళ్లు, ఆకర్షించే రూపం అలాగే నాజూకు నడుము అందాలతో సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఏకంగా హోస్ట్ కింగ్ నాగార్జున తోనే అందాల దివి అనిపించుకుంది. దివి ఒక హైదరాబాదీ. బిగ్ బాస్ హౌస్‌లో తాను ఉన్నది కేవలం ఏడువారాలే అయినప్పటికీ ఆ కొంచెం సమయంలోనే తనకంటూ క్రేజ్ ను క్రీయేట్ చేసుకుంది దివి. దివికి బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌లో మెగా ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
బిగ్ బాస్ వేదికపై మనిద్దరం కలిసి నటిస్తున్నాం అంటూ దివికి మెగా ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. వేదాళమ్ చిత్రం తెలుగులో రీమేక్ మెహర్ రమేష్-చిరంజీవి కాంబోలో అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దివిని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంపిక చేసినట్టు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
అలాగే ‘అయ్యప్పనమ్ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌గా చేయబోతున్న విషయం మనకి విదితమే. తాజాగా ఈ రీమేక్ చిత్రంలో కూడా దివి ప్రముఖ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…