Is divi tollywood deepika padukone?
దివి.. ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ తెలుగులో. తను బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంత తొందరగా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ.. తనను త్వరగానే ఇంటికి పంపించేశాడు బిగ్ బాస్. ఇంకా కొన్ని రోజులు ఉంటే.. బిగ్ బాస్ షోలో ఇంకాస్త ఆసక్తి ఉండేది. అప్పుడే దివిని బయటికి పంపించేసరికి.. షో కాస్త చప్పబడింది.. అనే వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి.
ఇక.. దివి బయటికి రావడం మొదలు.. ఆమెతో ఇంటర్వ్యూలు చేయడానికి అన్ని చానెళ్ల వాళ్లు ఎగబడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది? బయటికి వచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? అంటూ చానెళ్లలో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తన్నారు.
అయితే.. దివి మాత్రం బిగ్ బాస్ హౌస్ లో చాలా నేర్చుకున్నాను. బిగ్ బాస్ షోలోకి వెళ్లడం వల్ల నాకు ఎంతైతే పాపులారిటీ రావాలనుకున్నానో అంత పాపులారిటీ వచ్చేసింది. నాకు ఇది చాలు. నేను ఈ సమయంలో ఎలిమినేట్ అయినా నాకేమీ బాధ లేదు. ఎందుకంటే.. ఇంటికే కదా వెళ్లింది.. అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దివి.
నిన్ను తెలుగు సినిమా ప్రేక్షకులు.. టాలీవుడ్ దీపికా పదుకొణె.. అని అంటున్నారు. దానికి నీ సమాధానం ఏంటి? అని యాంకర్ దివిని ప్రశ్నించగా.. వాళ్లు అలా అనుకుంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. ఎందుకంటే.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం.. నన్ను దీపికాతో పోల్చిన వాళ్లకు చాలా థ్యాంక్స్ అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది దివి.
దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి..
Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…
BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…
Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్…
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…