‘పోకిరి’ సినిమాతో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మంచి అంచనాల మధ్య వచ్చిన పోకిరి బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు అనుకున్నపటికి అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని తిరగరాస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ‘పోకిరి’ ఇంత పెద్ద హిట్ అవుతుందని పూరీ కూడా ఊహించలేదని చాలా సందర్భాలలో స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ‘బిజినెస్ మ్యాన్’ వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
అయితే మూడవసారి మహేష్ – పూరి కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఇందుకోసం ఒక ప్రాజెక్ట్ కూడా అనుకున్నాడు పూరి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న కసితో ‘జనగణమన’ అన్న కథ కూడా మహేష్ కోసమే రాసినట్టు పూరి చాలా సందర్భాలలో చెప్పాడు. కాని ఈ ఇద్దరి కాంబినేషన్ లో అనుకున్న ‘జనగణమన’ తెరకెక్కలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల చాలామంది మహేష్ – పూరి మధ్య విభేధాలు వచ్చాయని మాట్లాడుకున్నారు. కాని పూరీ చెప్పిన కథ నచ్చితే మహేష్ చేసేందుకు రెడీగానే ఉన్నాడట.
ఇదిలా ఉంటే మహేష్ అంటే పూరి కి ఎంత అభిమానమో తాజాగా సర్కారు వారి పాట ప్రూవ్ చేసింది. తాజాగా మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పూరి దర్శకుడు పరశురాం కి శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేశాడు. సర్కారు వారి పాట చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కచ్చితంగా మహేష్ బాబు అభిమానులందరికీ పెద్ద ట్రీట్ అవుతుంది అంటూ మహేష్ బాబు మీద పూరి కి ఉన్న అభిమానాన్ని తెలిపాడు. అంతేకాదు తాను ముంబై లో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాని తెలిపాడు. మహేష్ – పూరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని మహేష్ అంటున్నారట.