Ileana : ఇలియానాకి టాలీవుడ్‌లో వస్తున్న అవకాశాలు ఎందుకు జారిపోతున్నాయి కారణాలు అవేనా..?

Share

Ileana : గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ఎనర్జిటిక్ హీరో రాం పోతినేని సరసన నటించిన దేవదాస్ సినిమాతో ఇద్దరు టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. రెండవ సినిమాకే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఆ సినిమానే పోకిరి. పోకిరి సినిమాలో ఇలియానా నటనకి ప్రేక్షకులు, మేకర్స్ ఫిదా అయిపోయారు. ఇల్లీ బేబీ బెల్లీ డాన్స్ అంటే పడి చచ్చేలా తన డాన్స్‌తో చంపేసింది. వరుసగా స్టార్ హీరోలు, డైరెక్టర్స్, బడా నిర్మాణ సంస్థలలో అవకాశాలు అందుకున్న ఇలియానా అతికొద్ది కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

is Ileana missing chances in tollywood because of this....?
is Ileana missing chances in tollywood because of this….?

మున్నా, ఆట, శక్తి, జులాయి, జల్సా, నేను నా రాక్షసి, సలీమ్, దేవుడు చేసిన మనుషులు, ఖతర్నాక్.. ఇలా వరుసగా సినిమాలు చేసిన ఇలియానా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా ఇలియానా నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. అయితే ఉన్నపలంగా సినిమాలకి దూరమై కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకుంది. సౌత్‌లో మంచి ఫాంలో ఉండగానే ఆమె ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచి సినిమాల పరంగా అవకాశాలను దూరం చేసుకుంది.

Ileana : ఇలియానాకి అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో సపోర్ట్ బాగానే ఉంది.

అదే సమయంలో ఆమెకి తెలుగులో నటించిన సినిమాలు కొన్ని ఫ్లాపులుగా నిలిచాయి. దాంతో తెలుగు కంటే హిందీ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడ అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో సపోర్ట్ బాగానే ఉంది. ఆయన సపోర్ట్‌తోనే హిందీ సినిమాలలో కాస్తో కూస్తో అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. అయితే మళ్ళీ గతకొంత కాలంగా టాలీవుడ్ సినిమాలు చేయాలని ఉబలాటపడుతోంది. ఈ క్రమంలో ఆమెకి రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో దక్కినప్పటికీ ఆ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

దాంతో మళ్ళీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఇలియానాకి చేతికి రెండు సినిమాలు వచ్చినట్టే వచ్చి జారిపోయాయట. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో ‘ఘోస్ట్’ అనే మూవీ రూపొందుతోంది. ఈ మూవీని హై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని తాజాగా వదిలిన పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది. రీసెంట్‌గా విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే కాజల్ కంటే ముందు హీరోయిన్‌గా ఇలియానాని ఫైనల్ చేసుకున్నారట. ఏమైందో ఏమో గానీ ఇలియానా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా తనని కాదని కాజల్‌ని ఎంచుకున్నారు.

Ileana : ఫాంలో లేని హీరోయిన్‌ను తీసుకుంటే సినిమాకి ఏమాత్రం ఉపయోగం..?

ఇదే కాదు గతంలో నాగార్జున, లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్’ సినిమాలోనూ ముందు హీరోయిన్‌గా ఇలియానానే అనుకున్నారు. కానీ చివరకు అనుష్కను ఫైనలైజ్ చేశారు. ఈ మధ్యలో కూడా రెండు మూడు సినిమాలకి ఇలియానా పేరు వినిపించింది. మరి ఎందుకు ఇలా ఓకే అనుకున్నాక ఇలియానా చేతి నుంచి అవకాశాలు జారిపోతున్నాయో తెలియడం లేదు. అయితే ఫాంలో లేని హీరోయిన్‌ను తీసుకుంటే సినిమాకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందో అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దానికి తోడు ఇలియానాలో ముందు ఉన్న గ్లామర్ ఇప్పుడు కనిపించడం లేదనేది కూడా మరో టాక్. అందుకే ఇలా అవకాశాలు మిస్ అవుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఆమె మాత్రం మళ్ళీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటాలనుకుంటోంది. మరి మన వాళ్ళు ఆ అవకాశం ఇస్తారా లేదా చూడాలి.

 


Share

Related posts

తీగలాగుతున్న సిబిఐ

somaraju sharma

Jathi Ratnalu : ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము రేపిన జాతి రత్నాలు..! రేపు రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఇవే..!!

bharani jella

Adani బ్రేకింగ్ : కృష్ణపట్నం పోర్టు మొత్తం అదానీదే..!!

sekhar