ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఎనర్జ్టిక్ హీరో రాం నటించిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ileyana మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగా యంగ్ హీరోలతో నటించింది. మహేష్ బాబు.. రవితేజ.. ఎన్.టి.ఆర్..పవన్ కళ్యాణ్.. రానా..లాంటి స్టార్స్ తో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అంతేకాదు అప్పట్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా ileyana హాట్ టాపిక్ అయింది కూడా.
కాని ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు లేక కనుమరుగైపోయింది. ఆ మధ్య మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని ఆశపడితే ఈ సినిమా డిజాస్టర్ కావడం తో ఇక మళ్ళీ తెలుగు సినిమాలో నటించే అవకాశం రాలేదు. కాని బాలీవుడ్ లో అప్పుడపుడు ఒక సినిమా చేసిన డీసెంట్ హిట్ అందుకుంటోంది. చెప్పాలంటే కాస్తో కూస్తో ileyana కెరిర్ బాలీవుడ్ లోనే బావుంది.
ఆ మధ్య అజయ్ దేవగన్ తో రైడ్.. సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. కాగా ప్రస్తుతం ileyana ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఇలియానా పూర్తి డీగ్లామరస్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటి వరకు ఇలియానా గ్లామర్ రోల్స్ లోనే నటించింది. ఫస్ట్ టైం ఇలాంటి డీగ్లామర్ రోల్ చేస్తోంది. మరి ఇలాంటి పాత్రలో ఫ్యాన్స్ చూస్తారా అంటే ఎవరు చెప్పలేరు. అసలే అవకాశాలు అంతంత మాత్రం.. ఇలాంటి సమయంలో ileyana ఈ ప్రయోగం ఏంటో.