Iliyana : ఇలియానాని రవితేజ రిఫర్ చేశాడా..?

Share

Iliyana : గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మాస్ మహారాజ రవితేజ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకుంది. అయితే టాలీవుడ్‌లో ఫ్లాప్స్ రాగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించింది. అక్కడ బర్ఫీ లాంటి విభిన్నమైన సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. అలాగే హిందీలో నెమ్మదిగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది.

is iliyana- referred by raviteja...?
is iliyana- referred by raviteja…?

అయితే మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోవాలని గత కొన్ని రోజులుగా అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆమె గత చిత్రం రవితేజ తో నటించిన అమర్ అక్బర్ ఆంటోని ఘోర పరాజయం కావడంతో మళ్ళీ ఇలియానాకి తెలుగులో ఎవరూ అవకాశాలివ్వలేదు. ఆ మధ్య నాగార్జున సరసన ఇలియానా నటించబోతోందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ తో రైడ్ అనే సినిమా చేసింది ఇలియానా. ఈ సినిమా అక్కడ సూపర్‌గా నిలిచింది. ఇందులో ఇలియానా పాత్రకి చాలా మంచి పేరొచ్చింది.

Iliyana : ఓ ఐటెం సాంగ్‌కి ఇలియానాను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.

దాంతో నాగార్జున హిందీ రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు రైడ్ తెలుగు రీమేక్‌లో కూడా నాగార్జునకి జంటగా ఇలియానాని తీసుకోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటికి వరకు ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన న్యూస్ ఏదీ రాలేదు. అయితే ఇప్పుడు రవితేజ నటిస్తున్న సినిమాలో ఆమెకి అవకాశం వచ్చిందని తెలుస్తోంది. కానీ హీరోయిన్‌గా మాత్రం కాదట. రవితేజ – డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ కాంబినేషన్‌లో రామారావు ఆన్ డ్యూటి అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఓ ఐటెం సాంగ్‌కి ఇలియానాను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.


Share

Related posts

దుబ్బాక రిజల్ట్ ఎఫెక్ట్ ప్రజలలోకి కేసిఆర్..??

sekhar

సైంటిస్ట్ పాత్ర‌లో

Siva Prasad

Solar Tent : సైనికులకు స్పెషల్ టెంట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

bharani jella