Anu-Emmanuel: బ్యాడ్ టైమ్ అంటే అనూ ఇమ్మానియేల్‌దే..!

Share

Anu-Emmanuel: సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు ఫాంలో ఉంటుందో ఏ హీరోయిన్ ఎప్పుడు ఫేడవుట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక్కడ సక్సెస్ మాత్రమే కొలమానం. అంటే మేకర్స్ సక్సెస్‌లలో హీరోయిన్స్‌నే ఎక్కువగా పట్టించుకుంటారు. లేదంటే పక్కన పడేస్తారు. ఓ స్టార్ హీరోకు వరసగా నాలుగు ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ సినిమా తీయడానికి దర్శక, నిర్మాతలు రెడీ అయిపోతారు. అదే హీరోయిన్ వరుసగా సక్సెస్‌లలో ఉండి టైమ్ బ్యాడ్ అయి రెండు ఫ్లాపుసొస్తే సగానికి సగం రెమ్యునరేషన్ పడిపోతుంది.

is it a bad time for anu-emmanuel
is it a bad time for anu-emmanuel

అదే విధంగా చేతిలో ఉన్న అవకాశాలు జారిపోతుంటాయి. నాలుగు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసినా రెండు సినిమాల రిజల్ట్ తేడా కొడితే మిగతా రెండు సినిమాలు ఉంటాయో ఊడిపోతాయో చెప్పలేని పరిస్థితుల్లో కొందరు హీరోయిన్స్ ఉన్నారు. ఇక ఎలాగైనా అవకాశాలను దక్కించుకోవాలని తాపత్రయపడే హీరోయిన్ గ్లామర్ గేట్లు ఎత్తేసి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి మరీ కొన్ని ఫొటో షూట్స్ చేసి అభిమానులకు, మేకర్స్‌కు షేర్ చేస్తుంటారు.

Anu-Emmanuel: పట్టించుకోకపోతే మాత్రం హీరోయిన్స్ పరిస్థితే అదో మాదిరిగా అయిపోతుంది.

దీనివల్ల అభిమానులకు పండగే గానీ, పట్టించుకోకపోతే మాత్రం హీరోయిన్స్ పరిస్థితే అదో మాదిరిగా అయిపోతుంది. ప్రస్తుతం అలా ఉన్న హీరోయిన్ అనూ ఇమ్మానియేల్. నాని నటించిన మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి మేకర్స్ బాగానే అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిలో సక్సెస్ రేట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ. అదే అనూ ఇమ్మానియేల్‌కు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. వరుసగా మంచి గ్లామర్ పిక్స్ షేర్ చేసి ఆకట్టుకుంటున్నా ఆశించిన
అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. ఇటీవల వచ్చిన మహా సముద్రం సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా ఫలితం ఏంటో తెలిసిందే.


Share

Related posts

KCR: కేసీఆర్ భారీ క‌ల‌… అడ్డం ప‌డుతున్న‌ కాంగ్రెస్ పార్టీ

sridhar

Krishnarpanam : కృష్ణర్పణం అని పెద్దవాళ్లు అనడం వెనుక ఉన్న రహస్యం తెలిస్తే.. మీరు అనకుండా ఉండలేరు !!  !!

siddhu

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్!ఆలయాల్లో ప్రమాణాల పర్వం!నిన్న అనపర్తి …నేడు విశాఖ!!

Yandamuri