Mahesh babu: మహేశ్‌కు గట్టి షాక్..రెండు రకాలుగా దెబ్బపడ్డట్టేనా.?

Share

Mahesh babu: బాక్సాఫీస్ బరిలో కొన్ని సార్లు భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. ఒకప్పుడు సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్స్‌లో ఒకేరోజు పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజైన సందర్భాలు చాలానే ఉన్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్ లేని సమయంలోనే ఇలా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్ లాంటి పెద్ద హీరోల సినిమాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద సత్తాచాటేవి. సినిమాలు బావుంటే అన్నీ చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరించేవారు. అలా రిలీజై కూడా వంద రోజులు నూటా యాభై రోజులు ఆడిన సినిమాలున్నాయి. కానీ మల్టీప్లెక్స్ వచ్చి నాలుగింతలు థియేటర్స్ రెట్టింపయ్యాక కూడా ఒకేసారి రెండు పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలంటే వసూళ్ల మీద ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.

is-it-a-big-shock-for-mahesh-babu
is-it-a-big-shock-for-mahesh-babu

ఈ క్రమంలో ఎవరు ముందు రిలీజ్ డేట్ ప్రకటిస్తే వారి సినిమానే రిలీజ్ అయ్యేలా మిగతా సినిమాలను పోటీ నుంచి తప్పించేలా చర్చలు సాగించి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఒకవేళ ఒప్పందం సరిగ్గా కుదిరితే ముందు రిలీజ్ డేట్ ప్రకటించినా పెద్ద సినిమా అనే ఆలోచన, మేకర్స్ రిక్వెస్ట్ మేరకు ముందు రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా తమ సినిమాను పోస్ట్ పోన్ చేయక తప్పడం లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మహేశ్ బాబుకు అటు నిర్మాతగా ఇటు హీరోగా వచ్చింది.

Mahesh babu: మహేశ్ బాబు కాంప్రమైజ్ అవుతూ సర్కారు వారి పాట సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా రూపొందుతోంది. సొంత నిర్మాణ సంస్థతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను పరశురాం తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వాస్తవంగా అన్నిటికంటే ముందు మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. అలాగే ప్రభాస్ రాధే శ్యామ్, పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్ కూడా రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. కానీ అనూహ్యంగా జనవరి 7, 2022న ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయబోతునట్టు రాజమౌళి బృందం ప్రకటించారు.

దాంతో మహేశ్ బాబు కాంప్రమైజ్ అవుతూ సర్కారు వారి పాట సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. కానీ ప్రభాస్, పవన్ – రానా సినిమాలు మాత్రం అనుకున్న తేదీకే రిలీజ్ కాబోతున్నాయి. ఇదిలా ఉంటే మహేశ్ బాబు సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మించిన మేజర్ సినిమాను కూడా రిలీజ్ డేట్ మార్చబోతున్నారట. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఆధారంగా మేజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్‌లో టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్నాడు.

Mahesh babu: మేజర్ సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందులో సాయీ మంజ్రేకర్, శోబిత ధూళిపాళ్ళ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా గూఢాచారి ఫేం శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 11, 2022కి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ రోజే రవితేజ – రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఖిలాడి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దాంతో మహేశ్ ఇప్పుడు మేజర్ సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం గట్టి దెబ్బ అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ నిర్మాణంలో రూపొందుతున్న మేకర్ కూడా పోస్ట్‌పోన్ అయితే మరో దెబ్బ పడినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Share

Related posts

YS Jagan : ఈ నెల 17న సీఎం జగన్‌తో చంద్రబాబు భేటీ..ఎందుకంటే..?

somaraju sharma

Covid -19: బ్రేకింగ్.. మంత్రి కేటిఆర్ కూ కరోనా పాజిటివ్ నిర్ధారణ

somaraju sharma

ఈ ఒక్క సినిమా చేయగలిగితే రష్మిక మందన్న తలరాతే మారిపోతుంది..!

GRK