NewsOrbit
Featured న్యూస్ సినిమా

Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌లా ఉండటమే స్నేహా ఉల్లాల్‌కి శాపమా..?

Sneha Ullal సాధారణంగా సినిమాలలో హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ డ్యూయల్ రోల్‌లో లేదా త్రిబుల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకే రూపు రేఖలతో కవలలుగా కనిపించే పాత్రలు సినిమాలో బాగా ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంటాయి. మంచి కన్‌ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయడానికి హీరో లేదా హీరోయిన్‌ను డ్యూయల్ రోల్ చూపించడానికి మన దర్శక, రచయితలు ఎక్కువగా ఇలాంటి కథలను ఎంచుకుంటుంటారు. డ్యూయల్ రోల్‌లో నటించడానికి హీరో లేదా హీరోయిన్ ఎంత ఆసక్తి చూపిస్తారో అలాంటి సినిమాలను చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తి చూపిస్తుంటారు.

is-it-a-curse-for-sneha-ullal-to-look-like-aishwarya-roy
is it a curse for sneha ullal to look like aishwarya roy

అయితే ఒకే స్టార్ హీరోయిన్ ని పోలిన మరో అమ్మాయి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైతే అది కొన్నిసార్లు మంచి చేసినా కొన్నిసార్లు కంపేరిజన్స్‌తో కెరీర్ దెబ్బైపోతుంది. ఒక స్టార్ హీరోయిన్‌తో కొత్తగా వచ్చిన అమ్మాయిని పోల్చడం సరికాకపోయినా కూడా అనూహ్యంగా ప్రేక్షకుల మధ్య కంపేరిజన్స్ వచ్చేస్తాయి. అలా రావడం వల్లే సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజీ హీరోయిన్‌గా మారాల్సిన అమ్మాయి కెరీర్ అర్థాంతరంగా ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఆ అమ్మాయే బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్నేహా ఉల్లాల్.

Sneha Ullal: సల్మాన్‌ ఐశ్వర్య రాయ్‌కి బదులుగా దాదాపు అదే పోలికలతో ఉండే స్నేహా ఉల్లాల్‌ని తీసుకు వచ్చాడు.

సల్మాన్‌కి ఐశ్వర్య రాయ్‌తో వచ్చిన విబేధాల కారణంగా లక్కీ అనే సినిమాలో తన సరసన నటించాల్సిన ఐశ్వర్య రాయ్‌కి బదులుగా దాదాపు అదే పోలికలతో ఉండే స్నేహా ఉల్లాల్‌ని తీసుకు వచ్చాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అయిన స్నేహా కెరీర్ ప్రారంభంలో బాగానే పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకదశలో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో దర్శకుడు కరుణాకర్ టాలీవుడ్‌కి తీసుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఆమెకి టాలీవుడ్ మేకర్స్ బాగానే అవకాశాలు ఇచ్చారు.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తర్వాత మంచి మనోజ్ సరసన నేను మీకు తెలుసా అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఒక మోస్తారు హిట్ సాధించింది. ఆ తర్వాత సుశాంత్ సరసన కరెంట్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా హిట్ సాధించినప్పటికీ సుశాంత్‌కి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఆమెకి అంతగా ఈ సినిమా సక్సెస్ కలిసి రాలేదు. నాగార్జున నటించిన కింగ్ సినిమాలో కొన్ని క్షణాలు గెస్ట్ అపీరియన్స్ కూడా ఇచ్చింది. అయినా మళ్ళీ అన్నపూర్ణ బ్యానర్‌లో మళ్ళీ అవకాశం దక్కలేదు. అయితే ఆ తర్వాత బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సింహ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.

Sneha Ullal: అటువంటి సినిమాలకి స్నేహా ఉల్లాల్ సెట్ కాదంటూ కామెంట్ చేశారు.

కానీ ఆమె బాలయ్య సరసన నటించడం ఏంటో అని కొందరు పెదవి విరిచారు. ఆ తర్వాత నటించిన రెండు మూడు సినిమాలు కూడా స్నేహా ఉల్లాల్‌కి అంతగా కలిసి రాలేదు. దీనికి కొంత కారణం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అని కొందరు కామెంట్ చేశారు. ఆమె పోలికలతో ఉన్న స్నేహా ఉల్లాల్ తనలాంటి సినిమాలు చేసేందుకు మాత్రం పనికి రాదని అందుకు అసలు ఏమాత్రం పోలిక లేదని అభిప్రాయాలను వ్యక్తపరచారు. ఒకరకంగా చూస్తే ఆ మాట నిజమని కూడా అనుకోవచ్చు. ఐశ్వర్య రాయ్ కెరీర్‌లో తాళ్, జీన్స్ వంటి అద్భుతమైన సినిమాలున్నాయి. అటువంటి సినిమాలకి స్నేహా ఉల్లాల్ సెట్ కాదంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో ఈమెకి సినిమాల ఎంపిక కూడా రాదని చెప్పుకున్నారు. చూడాలి మరి చాలాకాలానికి తెలుగులో ఎయిట్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri