Akhil : అఖిల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా రెడీ అవుతుందని చిత్ర బృందం ముందు నుంచి చెప్పుకొస్తోంది. అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే వాటిలో ఒకటి కూడా హిట్ లిస్ట్ లో చేరలేదు. సాధారణంగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరోకైనా డెబ్యూ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. లేదా ఆ తర్వాత వచ్చే రెండవ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. కానీ అఖిల్ కి మాత్రం చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ సినిమాలుగానే మిగిలాయి.
అయినా అక్కినేని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ముడు సినిమాలు ఫ్లాపయిన మరో మూడు సినిమాలు చేతిలో ఉండటం ఆసక్తికరం. అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ బన్నీ వాస్ నిర్మాతగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా రిలీజ్ చేయడమే తరువాయి. థియేటర్స్ ఓపెన్ అవగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆయనకి దర్శకుడిగా ఓ సాలీడ్ హిట్ కావాలి. అటు హీరో, ఇటు డైరెక్టర్ కి ఈ సినిమా సక్సెస్ తర్వాత కెరీర్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది.
Akhil : బొమ్మరిల్లు వంటి కథాంశం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కి ఎన్నుకున్నాడని టాక్ ఉంది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు వంటి కథాంశం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కి ఎన్నుకున్నాడని టాక్ ఉంది. కాబట్టి ఈసారి కమర్షియల్ హిట్ దక్కడం గ్యారెంటీ అనే నమ్మకంలో అందరూ ఉన్నారు. ఇక సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయో సినిమా ఏజెంట్ లో అఖిల్ మేకోవర్ చాలా భిన్నంగా ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే మరో పెద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా మంచి రొమాంటిక్ కథాంశం అని ఇన్సైడ్ టాక్. రానున్న మూడు సినిమాలలో ఓ రెండు భారీ హిట్ సాధిస్తే అఖిల్ కెరీర్ ట్రాక్ ఎక్కినట్టే అంటున్నారు.