న్యూస్ సినిమా

Yatra 2 : యాత్ర 2 అవన్నీ పుకార్లేనా..?

Share

Yatra 2 : యాత్ర 2 గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథలోని ప్రధాన పాదయాత్ర ఘట్టం ఆధారంగా ‘యాత్ర’ సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు మహి వి రాఘవ. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రూపొందించే ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. కానీ నాగార్జునతో ఓ సినిమా చేయనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది కేవలం రూమర్ అని ఆ తర్వాత వెల్లడైంది.

is it all rumours about yatra-2....?
is it all rumours about yatra-2….?

ఆ తర్వాత ఈ డైరెక్టర్ ఏ సినిమా చేయబోతున్నాడో అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఈ మధ్య యాత్ర 2 సినిమాకి సన్నాహాలు మొదలు పెట్టాడని, ఇందులో కీలక పాత్రకి గాను బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ ని ఎంపిక చేసుకున్నాడని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి వైరల్ అయింది. ఇది దర్శకుడి వరకు చేరడంతో ఆయన తన సన్నిహితుల వద్ద ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పినట్టు సమాచారం. ఇంకా యాత్ర 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా మొదలు పెట్టలేదని..అప్పుడే నటీ నటుల ఎంపిక ఎలా మొదలు పెడతానని తెలిపినట్టు టాక్ వినిపిస్తోంది.

Yatra 2 : మహి వి రాఘవ యూవీ క్రియేషన్స్ తో కలిసి ఓ సినిమా చేస్తునట్టు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మహి వి రాఘవ యూవీ క్రియేషన్స్ తో కలిసి ఓ సినిమా చేస్తునట్టు తెలుస్తోంది. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో ఓ సెటైరికల్ మూవీ తెరకెక్కిస్తున్నారట. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. దీనితో పాటు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా కోసం మహి రాఘవ ఓ వెబ్ సిరీస్ తీస్తున్నాడట. ఆ తర్వాత ‘యాత్ర 2’ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ అనే సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత ‘పాఠశాల’ సినిమాతో దర్శకుడయ్యాడు. ‘ఆనందో బ్రహ్మ’ సినిమా తీసి హిట్ కొట్టాడు.


Share

Related posts

Makeup Artist: నీరజ్ చోప్రా నుండి మిల్కాసింగ్ దాకా ఎవరి లాగా అయినా మారిపోవడం ఈ అమ్మాయి స్పెషాలిటీ

arun kanna

Chinthamaneni Prabhakar: చర్మం చిరేస్థం అంటూ చింతమనేనికి వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..!!

sekhar

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు

Siva Prasad