NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel saab : వకీల్ సాబ్ రీ రిలీజ్ ప్లాన్ అందుకేనా..?

Vakeel saab : వకీల్ సాబ్ ..ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ప్రపంచ వ్యాప్తంగా కేవలం అభిమానులలోనే కాదు యావత్ సినీ ప్రేమికుల్లోనూ రెట్టింపు ఉత్సాహం పెరిగింది. ఆ ఉత్సాహంతో సినిమా చూడాలనుకున్నారు. చూశారు. రికార్డ్ స్థాయిలో వసూళ్ళు కూడా రాబట్టింది. అయితే మంచి జోరు మీదున్న ఈ సినిమాకి కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో వకీల్ సాబ్ వసూళ్ళకి గట్టి దెబ్బ పడింది. ఊహించిన వసూళ్ళు రాబట్టక ముందే థియేటర్స్ మూసేశారు.

is it because of this vakeel-saab-re release is decided....?
is it because of this vakeel saab re release is decided

దాంతో అభిమానులు ఈ సినిమా ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపించారు. అలాగే మేకర్స్ ఓటీటీలోనూ రిలీజ్ చేయగా దాదాపు అందరూ సినిమా చూశారు. థియేటర్స్ లో చూడలేని వారు ఓటీటీలో చూసి ఆనందించారు. కానీ థియేటర్స్ లో మళ్ళీ మళ్ళీ చూడాలని ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇదే ఇప్పుడు మేకర్స్ లో ఓ కొత్త ఆలోచన కలిగేలా చేసిందంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది కాబట్టి మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు దిల్ రాజు – బోనీకపూర్ అనుకుంటున్నారట.

Vakeel saab : వకీల్ సాబ్ థియేటర్స్ లో రీ రిలీజ్ అయితే గ్యారెంటీగా మంచి కలెక్షన్స్….

ఇది తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడు మళ్ళీ వకీల్ సాబ్ థియేటర్స్ లోకి వస్తుందా అని చూస్తున్నారట. అప్పట్లో భారీ వసూళ్ళు వచ్చాయి అని ప్రచారం జరిగింది గానీ, బ్రేకీవెన్ సాధించిందా లేదా అన్నది గోప్యంగా ఉంచారు. అంటే వకీల్ సాబ్ రాబట్టాల్సిన వసూళ్ళు ఇంకా చాలానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ఇలా రీ రిలీజ్ ప్లాన్ చేశారట. గతంలో కూడా 100 రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి మంచి వసూళ్ళు రాబట్టారు. అదే ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా వకీల్ సాబ్ థియేటర్స్ లో రీ రిలీజ్ అయితే గ్యారెంటీగా మంచి కలెక్షన్స్ రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.శృతి హాసన్ కీలక పాత్రలో, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటించగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri