NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జీహెహ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీకు కష్టమైన పనే : ఎక్స్ అఫిషియో ఓట్లలో తెరాస ఫస్ట్

 

జీహెహ్ఎంసీ కార్పొరేటర్ స్థానాలు 150 . అంటే మేజిక్ మార్కు 76 . దీన్ని చేరుకుంటే చాలు మేయర్ పీఠం దక్కినట్లే. దీనికోసమే అన్ని పార్టీల పాకులాట. 76 మా పార్టీకు వస్తే చాలు. ఇక మాకు తిరుగుండదు. ఇలాంటి ఊహ లెక్కలు మీరు వేసుకుంటున్నారా? అయితే మీ లెక్కల పుస్తకం మూసేయండి. 76 స్థానాల లెక్కలు ఒకసారి పక్కన పెట్టి.. మేయర్ పీఠం ఎక్కాలంటే కావాల్సిన కొత్త లెక్కలను తిరగేయండి…

(అవేంటో చదివేయండి)

2007 లో మహా హైద్రాబాద్ నగరపాలకసంస్థ ఆవిర్భవించింది. హైద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న
12 మున్సిపాలిటీలు, 8 గ్రామా పంచాయతీలను విలీనం చేస్తూ ఎరపడిన జీహెచ్ఎంసీకు 2009 లో మొదటి మేయర్ ఎన్నికలు జరిగాయి. అప్పటివరకు మున్సిపాలిటీలుగా హైద్రాబాద్ ను అనుకుని ఉన్న ఎల్.బి.నగర్, గడ్డి అన్నారం, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కాప్రా, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపూర్, పఠాన్ చెరువు తో పాటు పంచాయతీలుగా ఉన్న శంషాబాద్, రవిరాళ, సతమరై, జల్లపల్లి, మామిడిపల్లి, మంఖల్, అంశగూడా , సర్దార్ నగరాలు మహా హైదరాబాద్లో కలిసిపోయాయి. మొత్తం 172 కిలోమీటర్ల ఏరియా మహా హైద్రాబాద్ పరిధిలోకి వచ్చింది.
** 2009 మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 కార్పొరేటర్ సీట్లు గెల్చుకుంటే, తెలుగుదేశం పార్టీ 45 , మజ్లీస్ 43 , బీజేపీ 4 స్థానాల్లో గెలిచారు. 6 మంది ఇండిపెండెట్లు గెలిచారు. అయితే మేయర్ పీఠం కోసం కావాల్సిన మెజారిటీ కాంగ్రెస్ కు రాలేదు. దింతో మజ్లీస్ పార్టీతో ఒప్పందం చేస్కుని రెండున్నరేళ్లు కాంగ్రెస్, మరో రెండున్నరేళ్లు మజ్లీస్ మేయర్ పీఠం మీద ఉండేలా ఎక్కడ పాలకవర్గం కొలువు తీరింది. మొదటి మేయర్ గా బండ కార్తీకరెడ్డి ఎన్నికయ్యారు.


** 2005 లోనే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా గుర్తిస్తూ వారు సభకు వచ్చి మున్సిపల్ చర్చలో పాల్గొనేలా చట్టం చేసారు. దింతో పటు వారికీ మేయర్ ఎన్నికలో సైతం వోట్ హక్కు కల్పించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వోట్ హక్కు వినియీగించుకునే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు 45 మంది. అంటే మేయర్ ఎన్నికలో 195 మంది పాల్గొంటారు.
** ప్రస్తుతం ఎక్స్ అఫిషియో సభ్యుల్లో తెరాస కు 31 మంది, మజ్లీస్ కు 10 , బీజేపీకి 3 , కాంగ్రెస్ కు 1 సభ్యుడి బలం ఉంది. అంటే 195 సంఖ్య బలానికి మేజిక్ మార్కుకు అవసరం అయ్యే 98 సభ్యుల బలంలో 31 మంది బలం తెరాస కు ఉన్నట్లే.
** ప్రస్తుత పరిస్థితిని చూస్తే తెరాస కు 2016 ఎన్నికల్లో 99 సీట్లు వచ్చాయి. ఎప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే వారికీ కనీసం 67 మంది కార్పొరేటర్లు గెలిచినా మేయర్ పీఠం దక్కుతుంది.
** బీజేపీ హైదరాబాద్లో బలం పుంజుకుంది. ప్రధాన పక్షంగా తెరాస కు పోటీ ఇస్తుంది. గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితం అయినా బీజేపీ మేయర్ పీఠం మీద గట్టి ఆశలే పెట్టుకున్నా వారికీ అది దక్కలంటే 95 కార్పొరేటర్లు గెలవాలి. అయితే ప్రచారంలో జాతీయ నాయకులూ సైతం దృష్టి పెట్టి ప్రచారానికి వచ్చినా, 95 సీట్లలో గెలవడం అంత సులభం అయ్యే పని కాదు. పాత బస్తీలో మజ్లీస్ ను బీజేపీ ఢీ కొనలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో గెలుస్తుంది అని రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తే కాంగ్రెస్ మేయర్ పీఠం మీద ఇలాంటి ఆశలు పెట్టుకున్నట్లే లేదు.


** బీజేపీ మురికవాడ, బస్తి ప్రజలను ఏ మాత్రం ప్రభావితం చేయగలడు అన్నది చూడాలి. తెరాస కు బస్తీల్లో మంచి పట్టు ఉంది. దీన్ని బీజేపీ ఎలా ఛేదిస్తుంది అనేది ఎన్నికల్లో తేలుతుంది. వీరే వచ్చే ఎన్నికల్లో పరిస్థితిని నిర్ధారించనున్నారు.
** మజ్లీస్ గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేస్తే ఈ సారి 51 డివిజన్ ల మీదనే ద్రుష్టి పెట్టింది. పాత బస్తి అనుకుని ఉన్న కొన్ని డివిజన్ లను పక్కను పెట్టింది. మజ్లీస్ అన్ని డివిజన్ లలో గెలిచినా మేయర్ పీఠం కు అవసరం అయ్యే సంఖ్యాబలం రాదు. తెరాస తో జత కలుస్తుంది లేదా అనేది చూడాలి.

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!