టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సొంతగా పైకొచ్చిన వాళ్ళలో హీరో రవితేజ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు. వరసగా భారీ సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ని సంపాదించుకున్నాడు. మాస్ మహారాజా అన్న ఇమేజ్ ని సాధించాడు. స్టార్ గా మారిన రవితేజ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకొని టాలీవుడ్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చాడు.
ఇక రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘క్రాక్’ సినిమా దాదాపుగా పూర్తి అయ్యిందట. కేవలం రెండు వారాలు రెగ్యులర్ షూటింగ్, అందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆమద్య ఓటీటీలో రిలీజ్ కాబోతుందని ప్రచారం జరిగింది. కాని చిత్ర యూనిట్ సభ్యులు ఆలస్యం అయినా థియేటర్ లోనే మా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు అధికారకంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ కొత్త సినిమాల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.
రవితేజ క్రాక్ కంప్లీట్ కాగానే రమేష్ వర్మ తో పాటు మరో దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమాలను ఒకేసారి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఈ రెండు సినిమాల రిలీజ్ కూడా రెండు. మూడు నెలల తేడాతోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడట. ఏడాది ప్రారంభంలో ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు మేకర్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా చిరంజీవి చంటబ్బాయి సినిమాకు అనఫిషియల్ రీమేక్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
చంటబ్బాయి స్టోరీ లైన్ తో పాటు కొన్ని పాత్రలను ఆధారం చేసుకుని ఆ సినిమాను రీమేక్ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా చంటబ్బాయి అన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి సినిమాను రీమేక్ చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక గత కొంతకాలంగా రవితేజ సినిమాలన్ని వరసగా ఫ్లాపవుతున్న సమయంలో ఇలా ప్రయోగాలను చేయడం అంటే కాస్త రిస్క్ అంటున్నారు. రవితేజ ఈ వయసులో చంటబ్బాయి పాత్రను పోషించడం కూడా కష్టమే అన్న మాట వినిపిస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!