బాహుబలి రెండు భాగాలతో రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మళ్ళీ ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసే సినిమా రాలేదు. ఆమధ్య మెగాస్టార్ నటించిన సైరా మీద అలాగే ప్రభాస్ నటించిన సాహో మీద భారీగా అంచనాలు ఏర్పడినప్పటికి బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయడం లో ఈ రెండు సినిమాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను చాలా సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాలుగా రూపొందించి బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు.
ఆ సినిమాలలో ఆర్ ఆర్ ఆర్ కూడా ఉండటం విశేషం. ఆర్ ఆర్ ఆర్ దర్శక ధీరుడే తన సినిమా బాహుబలి ఫ్రాంఛైజీ తో పోటీ పడబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో బాహుబలి రికార్డ్ బద్దలవడం ఖాయమని ఇప్పటికే టాక్ ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా రిలీజైన రామరాజు ఫర్ భీం తో ఆ నమ్మకం ఇంకా పెరిగింది.
అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట తో రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సిద్దమవుతున్నాడని చెప్పుకుంటున్నారు. సర్కారు వారి పాట యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. పరశురాం ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ నటించబోతున్న ఈ సినిమా. జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్, మైత్రీ మూవీస్ పతాకాలపై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులని బట్టి సర్కారు వారి పాట సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. డిసెంబర్ నుంచి లేదంటే జనవరి నుంచి మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. జనవరి కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి పండుగ తర్వాతే ఉంటుంది. మరి ఆలస్యంగా మొదలవుతున్న సర్కారు వారి పాట సమ్మర్ లో రిలీజ్ కావడం కష్టమే అన్న మాట వినిపిస్తుంది. ఒకవేళ అన్ని కుదిరితే సమ్మర్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది.