Chicken: అనుమానం
మాంసాహారులలో చాలా మంది కి ఏది తింటేఆరోగ్యానికి మంచిది అనే సందేహం వస్తుంటుంది. శరీరం ( skin ) లో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా ఉండాలంటే మాంసాన్ని ఫ్రై చేసుకోవాలా,కూరగా ఉడికించుకుని తింటే మంచిదా అనేది కొంచెం అనుమానం గా ఉంటుంది. వాటి గురించి తెలుసుకునే ముందు శరీర నిర్మాణం గురించి తెలుసుకుందాం.
Chicken: చికెన్ యథాతదం గా తినడం
మన శరీర నిర్మాణం చాలా క్రమపద్దతిలో ఉంటుంది.కొవ్వు కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక రకమైన పదార్ధం . ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే , శరీరం బరువు పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం గా ఎర్రటి మాంసం అంటే మేక, గొర్రెలో మాంసం లో అయితే ఎక్కువ ఫ్యాట్ కొలెస్ట్రాల్ ( colestral )కంటెంట్ ని కలిగి ఉంటాయి.. కాబట్టి వీటిని అస్తమానం తినడం వలన నష్టం కలుగుతుంది. కాబట్టి నెల లేదా రెండు నెలలకు ఒకసారి మాత్రమే తినడం మంచిది. అలాగే ప్రతి రోజు ఒక గుడ్డు తినడం వలన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య రాదు.
ఇక చికెన్ తినే విషయానికి వస్తే.. చికెన్ యథాతదం గా తినడం కంటే.. స్కిన్ లెస్ చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు డాక్టర్స్. ఇది ఎంత మంచిదైనా కూడా 15 రోజులు కి లేదా నెలకి ఒకసారి మాత్రమే తినాలి అని సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి మంచిది
చికెన్ బ్రెస్ట్ లో, తొడలు, రెక్కలు కాళ్ళు ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కో పరిమాణంలో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. కాబట్టి గ్రిల్ చికెన్ తినడం అనేది ఆరోగ్యానికి మంచిది అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఏ మమసాహారమైన మితం గా తింటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మరువకండి.