NewsOrbit
Featured న్యూస్ సినిమా

Kajal agarwal: బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న కాజల్ అగర్వాల్..ఇది చివరి ప్రయత్నమా..?

Kajal agarwal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దాదాపు అందరు హీరోయిన్స్ నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీదే. ఎందుకంటే అక్కడ మార్కెట్ స్థాయి చాలా ఎక్కువ. హిందీలో నిర్మించిన సినిమాలన్నీ దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుంటాయి. ఆ కారణంగానే అక్కడ హీరోలకు, హీరోయిన్స్‌కు భారీ క్రేజ్ దక్కుతుంది. ఇదే వారి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరగడానికి ముఖ్య కారణం అవుతుంది. అందుకే సౌత్ ఇండస్ట్రీలోని అన్నీ భాషలలో నటించే హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్ బాలీవుడ్‌లో సెటిలవ్వాలని ఆరాటపడుతుంటారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అందుకోలేక టాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకొని ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన పూజా హెగ్డే ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో ఫోకస్ పెట్టింది. ఛలో సినిమాతో వచ్చి అనూహ్యంగా పెద్ద సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకున్న రష్మిక మందన్న ఇప్పుడు సౌత్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇక  సమంత ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ లో నటించి ఆకట్టుకుంది. అంతకముందు అంతగా బాలీవుడ్ మీద ఫోకస్ చేయని సమంత ఈ వెబ్ సిరీస్‌తో వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడు తెలుగు కంటే ఎక్కువగా హిందీ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తోంది.

 

Kajal agarwal: బాలీవుడ్‌లో కియారా అద్వానీ మాదిరిగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోతున్నారు.

నిధి అగర్వాల్ లాంటి వారు ముందు ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌లోనే అయినా సక్సెస్ అయింది మాత్రం తెలుగు సినిమాలతోనే. ఆ తర్వాత తమిళ సినిమాలు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ఫోకస్ కూడా బాలీవుడ్ మీద బాగా ఉంది. ఇక్కడ సక్సెస్ కాని తాప్సీ కూడా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఇలా తెలుగు హీరోయిన్స్ చాలామంది హిందీ ఇండస్ట్రీకే వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అయితే హిందీలో కూడా సక్సెస్ లేని హీరోయిన్ సౌత్ లో ఎంత పెద్ద స్టార్ అయినా పట్టించుకోరు. ఇక కాజల్ లాంటి వారు ఎంత ట్రై చేసినా కూడా బాలీవుడ్‌లో కియారా అద్వానీ మాదిరిగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోతున్నారు.

వాస్తవంగా చెప్పాలంటే కియారా అద్వానీ కంటే కాజల్ అగర్వాల్ ముందు ఇండస్ట్రీకి వచ్చింది. దాదాపు 15 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ కాజల్ అకౌంట్‌లో ఉన్నాయి. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ హిందీలో ఎందుకనో కాజల్ అగర్వాల్ వరుసగా ఆఫర్ దక్కించుకోలేక స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఏవో కొన్ని సినిమాలు చేసినా అవి కాజల్‌ను అక్కడ అగ్ర స్థానంలో నిలబెట్టలేకపోయాయి. అయినా ఆమె ప్రయత్నాలు మాత్రం మానలేదు.

Kajal agarwal: కాజల్ ఈ ప్రయత్నం అయినా ఫలిస్తుందా లేదా.

ఈ క్రమంలోనే హిందీలో ‘ఉమ’ అనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అయోషి తాలుక్దార్, గౌరవ్ శర్మ, టిన్ను ఆనంద్, మేఘనా మాలిక్, హర్ష్ ఛాయా, లాంటి వారు కీలక పాత్రలు పోషించనున్నారు. మిరాజ్ క్రియేషన్స్ సమర్పిస్తుండగా, ఎవిఎంఏ మీడియా వారు నిర్మిస్తున్నారు. మంత్రరాజ్ పలివాల్, అవికేష్ ఘోష్, మనీషా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వల్ల ఆలస్యం అయింది. తథాగత సింఘా ఈ సినిమాకి దర్శకుడు. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి కాజల్ ఈ ప్రయత్నం అయినా ఫలిస్తుందా లేదా.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu