NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ పై కేసులు : ఆలోచిస్తున్న ప్రభుత్వం

జనసేన అధ్యక్షుడు పవన్ కాలేయం మీద కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు తగిన సూచనలు వెళ్లాయని, అయితే ప్రస్తుతం ఆయన నివర్ తుఫాను వాళ్ళ నష్టపోయిన రైతుల పరామర్శలో ఉన్న దృష్ట్యా పర్యటన అయిపోయిన వెంటనే కేసుల నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు కొన్ని ఆదేశాలు వచ్చినట్లు తేలింది.

గుంపులు వీడియోలు సేకరణ

నివర్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన బుధవారం మొదలు పెట్టారు. కృష్ణ, గుంటూరు జిల్లాల పర్యటన అనంతరం గురువారం చిత్తూర్, నెల్లూరు జిల్లాలు వెళ్లనున్నారు. అయితే పవన్ పర్యటనలో ఆసాంతం కార్యకర్తల కోలాహలం కనిపించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచే గుంపులుగా ఉంటూ, కనీసం మాస్క్ లు పెట్టుకోకుండా కోవిద్ నిబంధనలు పూర్తిగా గాలికి వదిలి ప్రవర్తించిన తీరు ఆయన పర్యటన ఆసాంతం కనిపించింది. ఇప్పుడు దీని మీదనే పోలీసులు సీరియస్ గ ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. ప్రతి చోట వీడియోలు తీసుకున్న పోలీసులు వద్ద పవన్ పర్యటన నిమిత్తం అనుమతులు తీసుకున్న జనసేన నాయకులను ఇప్పటికి పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. యువకులను కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెందుకు అని, తమకు చెప్పిన విషయాలేవీ పవన్ పర్యటనలో అమలు కాలేదని వారించారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు , దాని తాలూకా ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉన్నాయి. గుంపులుగా ఉన్న, ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా వాటిని బేఖాతరు చేసే వారిపై కేసులను నమోదు చేస్తుంది. దీనిపైనే పోలీసులు ఇప్పుడు ప్రధానంగా ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

పర్యటన అయ్యాక కేసులేన ?

పవన్ పర్యటన గురువారం సైతం ఉంది. చిత్తూర్ , నెల్లూరు జిల్లాల రైతులను పరామర్శిస్తారు. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. ఈ తరుణంలో ఆయన మీద కేసులు నమోదు అంటే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఇప్పుడు కాకుండా పర్యటన మొత్తం ముగిసాక
పవన్ తో పటు పర్యటన అనుమతులు తీస్కుని దాన్ని ఉల్లంఘించిన వరి మీద కేసులు నమోదుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు సమాచారం.
* పవన్ పర్యటనలో కేవలం ఆయన తప్ప వచ్చినవారిలో ఎవరికీ మాస్క్ లు కనిపించలేదు. భారీగా వచ్చిన యువతను కంట్రోల్ చేయడం ఇటు పోలీసులకు సాధ్యం కాలేదు. కనీసం మాస్క్ లు పెట్టుకోవాలని పోలీసులు పదేపదే సూచించిన దాన్ని పట్టించుకున్న వారు లేరు. దీనిపై పొలిసు అధికారులు సీరియస్ అయ్యారు. దేశం మొత్తం మీద కరోనా నిబంధనలు ఉన్న దృష్ట్యా … ఇప్పుడు పవన్ పర్యటన వాళ్ళ కరోనా కేసులు పెరిగితే ఎవరిదీ బాధ్యత అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే యువత పై నియంత్రణ చేయలేనప్పుడు కార్యక్రమం ఎందుకు నిర్వహించారని నిర్వాహకుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కేసుల గురించి మాట్లాడేందుకు పొలిసు అధికారులెవరూ అంత ఆసక్తి చూపకున్న పవన్ పర్యటనకు వెళ్లిన మొత్తం నాలుగు జిల్ల్లా పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేయవచ్చని తెలుస్తోంది.

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!