ఇందులో నిజమెంత అంత సులభంగా నాగార్జున ఒప్పుకోడే ..?

Share

కరోనా కారణంగా సినీ ప్రేమికుల అలవాట్లు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. లాక్ డౌన్ కి ముందు ధియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చేస్తూ ఎంజాయ్ చూసే వారు. కానీ కరోనా కారణంగా ప్రస్తుత పరిస్దితుల్లో ఇంట్లో కూర్చుని ఓటీటీలో నచ్చిన సినిమాలు చూస్తున్నారు. కాకపోతే పెద్ద హీరోల చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవడం లేదనే బాధ కొంత మంది అభిమానుల్లో ఉండచ్చూ. అలాంటి వారికోసం సర్‌ప్రైజింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా చెప్పాలంటే ఇది అక్కినేని అభిమానులకి అని చెప్పాలి.

First Look of Wild Dog: Nagarjuna as NIA officer - tollywood

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున.. నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అన్న సినిమాలో నటించాడు. రీసెంట్ గా ఈ సినిమా కులుమనాలిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ కీలక పాత్ర పోషిస్తుండగా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ కాబోతోంది.

కాగా ఇప్పుడు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున వైల్డ్ డాగ్ ఓటీటీలో రిలీజ్ కావచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఓటీటీలో యంగ్ హీరోస్ సినిమాలు మాత్రమే చూశాం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు ఓటీటీలోకి వస్తాయా అని అనుకున్న నేపథ్యంలో నాగార్జున వైల్డ్ డాగ్ తో రాబోతున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగార్జున నిర్మాతలని దృష్ఠిలో పెట్టుకొని ఓటీటీ రిలీజ్ కి ఒకే చెప్పాడని చెప్పుకుంటున్నారు.


Share

Related posts

Oxymeter: షాక్ః ఆక్సిమీట‌ర్ వాడితే బ్యాంకులో డ‌బ్బులు క‌ట్‌

sridhar

మావోలు మళ్లీ వచ్చేశారు! వార్నింగులు ఇచ్చేశారు !! మరి కేసీఆర్ ఏం చేస్తారో?

Yandamuri

తెలంగాణలో అరలక్ష ఉద్యోగాలు..! యువత త్వరపడండి..!!

bharani jella