NewsOrbit
న్యూస్ హెల్త్

ప్లాస్టిక్ కప్ లో టీ, కాఫీ తాగుతున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి!

టీ, కాఫీ తాగేందుకు స్టాల్ కు పోయిన వెంట‌నే.. ప్లాస్టిక్ క‌ప్ లో టీ, కాఫీని ఇవ్వ‌మ‌ని అడుగుతుంటాం. కార‌ణం వేరేవాళ్ల‌నుంచి మ‌న‌కు ఏ రోగం సోక‌కుండా క‌దా..? కానీ ఆ ప్లాస్టిక్ క‌ప్ లో తాగ‌డం వ‌ల్ల చాలా ప్ర‌మాద‌మ‌ని ఒక రీసెర్చు చేబుతోంది. ఈ ప‌రిశోధ‌న తెలిపిన విష‌యాల‌ను తెలుసుకుంటే ప్లాస్టిక్ క‌ప్ ల‌ను ఆడ‌గ‌డం మానేస్తామేమో.. ఇలా ప్లాస్టిక్ క‌ప్ ల‌లో తాగ‌డం వ‌ల‌న కొన్ని వేల హానిక‌ర మైక్రో ప్లాస్టిక్స్ మ‌న శ‌రీరంలోకి పోతాయ‌ని మీకు తెలుసా..?

ప్లాస్టిక్ క‌ప్ లో వేడి వేడి టీ, కాఫీ తాగితే.. మంచి గురించి దేవుడెరుగు కానీ.. ప్ర‌మాదం మాత్రం పొంచి ఉంటుంద‌ని ఇప్పుడు ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. అయితే ప్లాస్టిక్ క‌ప్ లో లీకేజీ కాకుండా ఒక లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ వ‌ల్ల వాట‌ర్ ప్రూఫ్ అవుతుంది. కానీ ఆ లైనింగ్ ఇప్పుడు ప్రాణాల‌మీద‌కు వ‌చ్చింద‌ని ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. అది కేవ‌లం మ‌న శ‌రీరానికి హాని చేయ‌డ‌మే కాకుండా.. వాత‌వ‌ర‌ణానికి కూడా ప్ర‌మాద‌మ‌ని తెలుస్తోంది.

దీన్ని రీసైకిల్ చేయ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. ప‌రిశోధ‌న చేయ‌డానికి 100 మిల్లీ లీట‌ర్ల వేడి నీటిని ఈ ప్లాస్టిక్ క‌ప్ లో పోసి 15 నిమిషాలు ఉంచారు. ఆ త‌ర్వాత ఆ నీటిని మైక్రో స్కోప్ తో ప‌రీక్షించారు. దాంతో ఎన్నో విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఆ నీటీలో హానికార‌క‌మైన జింక్, లెడ్, క్రోమియం ఉన్నాయ‌ని గుర్తించారు. అయితే ఈ హానికార‌క‌మైన లోహాలు ఉండ‌టానికి కార‌ణం ప్లాస్టిక్ క‌ప్ లోని లైనింగ్ అని గుర్తించారు.

ఆ నీటిలో ప‌రిశోధ‌కులు క‌నిపెట్టిన‌ పార్టికిల్స్ ఒక మైక్రాన్ అంత పెద్దగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. రోజుకు మూడు సార్లు ప్లాస్టిక్ కప్ లో టీ, కాఫీ తాగే ఒక వ్యక్తి శ‌రీరంలోకి 75 వేల చిన్న చిన్న‌ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ పోతాయ‌ని గుర్తించారు. దీంతో ఎంతో ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు సూచించారు. అయితే ఈ ప్లాస్టిక్ క‌ప్ లో వేడి ప‌దార్థాలు పోసిన‌ప్పుడు వ‌చ్చే పార్టికల్స్ మాములుగా మ‌న‌ కంటికి క‌నిపించ‌మ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

మ‌న శ‌రీరానికి హాని చేసే పెలాడియం, క్రోమియం, కాడ్మియం వంటివి ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. వీటిని రెగ్యులర్ గా శ‌రీరంలోకి తీసుకుంటే.. హెల్త్ పాడ‌వుతుంద‌ని తెలిపారు. అయితే ఫుడ్ ను ప్యాకేజింగ్ చేసేందుకు వాడే ప్లాస్టిక్ లో ఆరోగ్యానికి హాని చేసే కార‌కాలు ఉన్న‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేదు. కానీ ప్లాస్టిక్ క‌ప్ లు శ‌రీరానికి హాని చేస్తాయ‌ని ఈ రీసెర్చ్ చెబుతోంది. దీనిపై ప్ర‌భుత్వాలు ఏ నిర్ణ‌యం తీసుకుంటాయో వేచి చూడాలి.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N