మాజీ సీఎంపై లోకాయుక్త లో కేసు నమోదైతే అది చిన్న వార్తా? ఎవరిపైన? ఏమిటది?

Share

ఒక మాజీ ముఖ్యమంత్రి పై లోకాయుక్తలో కేసు నమోదైతే అది ఎంతో పెద్ద వార్త. కాని ఎల్లో మీడియాకు మాత్రం అది సింగిల్ కాలం వార్తలా కనిపించటం

Is it small news if a case is registered in the Lokayukta against the former CM Anyone What is it
Is it small news if a case is registered in the Lokayukta against the former CM Anyone What is it

 

దాన్ని ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఎక్కడో ఒకచోట ముక్కలాగా ప్రచురించటం ,కేసు నమోదయ్యాక కూడా కేవలం ఫిర్యాదు అన్నట్టుగానే హెడ్డింగ్ పెట్టడం పత్రికా రంగంలోని పెడ ధోరణులకు అద్దం పడుతోంది.ఇలాంటి ధోరణులు చూసినప్పుడే అలాంటి పత్రికలను ఎల్లో మీడియా అనక తప్పడం లేదు.ధర్మ పోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో 2019 ఫిబ్రవరి పదకొండు న నిర్వహించిన కార్యక్రమానికి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వియోగం చేశాడని ఏవి రమణ అనే న్యాయవాది ఫిర్యాదు చేయగా ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త ఈనెల 7వ తేదీన ఈ కేసు నమోదు చేసి ఆ సమాచారాన్ని సదరు ఫిర్యాదుదారునికి పంపింది.

అక్టోబర్ ఒకటో తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుందని కూడా లోకాయుక్త వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు నాయుడు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు నిర్వహించారు.చివరగా ఢిల్లీలో కూడా ఈ సభను జరిపారు.ఈ సభల నిర్వహణకు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం. ఒక డిల్లీ సభకే ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానానుండే వ్యయం చేశారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చేసి ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే ప్రకటించిన తదుపరి దాన్ని స్వాగతించిన చంద్రబాబు తదుపరి రాజకీయ మైలేజీ కోసం యూ టర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటూ నినాదం చేపట్టారు.

ఇందులో భాగంగా ధర్మపోరాట దీక్షలు చేపట్టారు.ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ప్రజల సొమ్ముతో ఇలా తిరుగుబాటు ధోరణిలో సభలు నిర్వహించడమే ఇక్కడ ఆక్షేపణీయం. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేశారని పిటిషనర్ లోకాయుక్త దృష్టికి తెచ్చారు.లోకాయుక్త కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేసింది.ఇప్పుడు చంద్రబాబు ఎలా దీన్ని ఎదుర్కొంటారో చూడాలి ! న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగలరన్న కీర్తి చంద్రబాబుకి ఎలానూ ఉందిగా?


Share

Related posts

మెగాస్టార్.. పవర్ స్టార్ లతో త్రివిక్రం మెగా మల్టీస్టారర్ … త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ..?

GRK

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. దిగివస్తున్న వెండి ధరలు..!!

bharani jella

24గంటల్లో 5,611పాజిటివ్ కేసులు:140మంది మృతి

somaraju sharma