Venu sriram : వేణు శ్రీరామ్ నిజంగానే అలా అయిపోతాడా..?

Share

Venu sriram : వేణు శ్రీరామ్.. టాలీవుడ్ లో అంతక ముందు చేసింది రెండు సినిమాలే. ఆ సినిమాలు కూడా ఠక్కున ఎవరికీ గుర్తు రావు. బాగా ఆలోచిస్తే నాని – సాయి పల్లవిల సినిమా కదా అంటారు. వేణు శ్రీరామ్ దర్శకుడిగా టాలీవుడ్ లో కి వచ్చి దాదాపు 19ఏళ్ళు కావస్తోంది. సిద్దార్థ్ శృతి హాసన్, హన్సిక మొత్వానీ నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా మారాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత నాని – సాయి పల్లవి జంటగా ఎం.సి.ఏ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ ఏమీ కాదు.

is it the same thing repeats with venu sriram...?
is it the same thing repeats with venu sriram…?

ఇలాంటి సినిమాలు చేసిన కూడా దిల్ రాజు కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టి మంచి టాలెంటెడ్ కాబట్టి అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. కానీ అల్లు అర్జున్ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టడంతో అదృష్టం కొద్ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్, కోలీవుడ్ కంటే అద్భుతంగా తీశాడని ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా వేణు శ్రీరామ్ పేరు టాలీవుడ్ లో మోగిపోయింది.

Venu sriram : వేణు శ్రీరామ్ విషయంలో కూడా అదే జరుగుతుందా అంటున్నారట.

అయితే ఇప్పుడు మరో హాట్ టాపిక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ కథ రెడీ చేసుకోమని.. మనం మరో సినిమా చేద్దామని చెప్పాడట. అయితే ఇప్పుడు అందరూ కామెంట్స్ చేస్తుంది వేణు శ్రీరామ్ కూడా డాలి మాదిరిగా అయిపోతాడా అని. డాలీ కూడా పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేశాడు. రెండు పెద్ద హిట్ ఏమీ కాదు. అయినా మూడవ సినిమా చేద్దామని పవన్ చెప్పడంతో దాదాపు మూడేళ్ళుగా వేయిట్ చేస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ ఓకే చేసిన దర్శకులలో డాలీ లేడు. అదే ఇప్పుడు వేణు శ్రీరామ్ విషయంలో కూడా జరుగుతుందా అంటున్నారట.


Share

Related posts

అందరినీ కలిపి ఒక తొక్కు తొక్కబోతున్న రేవంత్ రెడ్డి..??

sekhar

బిగ్ బాస్ 4 : దీనికి బిగ్ బాస్ సమాధానం చెప్పకపోతే షో ఫైనల్స్ వరకు వెళ్ళడం కష్టమే..?

arun kanna

లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ

Siva Prasad