ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్లాన్ ప్రభాస్ ని టార్గెట్ చేసేనా ..?

Share

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో పోరాట యోధుడు కొమరం భీం పాత్ర ని పోషిస్తున్నాడు.

Jr NTR to work with KGF director Prashanth Neel after RRR? | by ...

ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలోనే రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే మరో సినిమాని మైత్రీ మూవి మేకర్స్ లో చేయబోతున్నాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమా ఎన్.టి.ఆర్ 31 వ సినిమాగా రూపొందనుండగా కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే తయారవనుంది.

అయితే ఈ సినిమాని హిందీలో డబ్బింగ్ చేయకుండా స్ట్రైట్ సినిమాగా తెరకెక్కించాలన్న ప్రతిపాదన ఎన్.టి.ఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందు పెట్టాడట. అంతేకాదు ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేయమని సూచించినట్లు తెలుస్తుంది. నిజంగా ఇలా స్ట్రైట్ సినిమాగా రిలీజైతే మాత్రం బాలీవుడ్ లో ఎన్.టి.ఆర్ రేంజ్ అమాంతం పెరగడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు పాన్ ఇండియా హీరో అవడానికి ఏకంగా ప్రభాస్ నే టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.


Share

Related posts

రైతుల‌కు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 36 వేలు పొందే అవ‌కాశం!

Teja

Chiranjeevi : చిరంజీవి – రామ్ చరణ్ ఆచార్య కోసమే కాదు రాజమండ్రి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది..!

GRK

భారత దౌత్యాధికారులకు పాక్‌లో బెదిరింపులు

somaraju sharma