Salman khan : సల్మాన్ ఖాన్‌కి వర్కౌట్ అవలేదు..ప్రభాస్‌కి అవుతుందా..?

Share

Salman khan : సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఆయన సినిమాలు ఈద్‌కి వస్తున్నాయంటే బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ అండ్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఉండే హంగామా ఊహించని రేంజ్‌లో ఉంటుంది. భరత్, ఏక్ థ టైగర్, సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి సినిమాలు భారీ వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్ఠించాయి. ఈ క్రమంలో రాధే సినిమా తాజాగా వచ్చింది. గత ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా కారణంగా అన్నీ చిత్ర పరిశ్రమలోని సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు.

is it works out for prabhas than salman-khan-
is it works out for prabhas than salman-khan-

అలాగే రాధే కూడా రిలీజ్ కాకుండా కొన్ని నెలలు పోస్ట్ పోన్ చేసి తప్పని పరిస్థితుల్లో విదేశాలలో 700 స్క్రీన్ల తో పాటు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏమాత్రం బాగోలేదనే కామెంట్స్ వినిపించాయి. కానీ వసూళ్ళు బాగానే ఉన్నాయని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఆశించినంతగా లేవనేదే ఫైనల్ టాక్. అయితే ప్రభాస్ కూడా ఇదే రూట్‌లో తన రాధే శ్యామ్ సినిమాను రిలీజ్ చేసే విధంగా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ నుంచి రావాల్సిన ఈ సినిమా కూడా చాలా డిలే అయింది.

Salman khan : ప్రభాస్‌కి వర్కౌట్ అవుతుందా అనేది అందరిలో కలుగుతున్న పెద్ద సందేహం.

యూవీ క్రియేషన్ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కేవలన్ 10 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్ ఉండటంతో జూలై 30న అనుకున్నట్టుగా రాధే శ్యామ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అప్పటికి పరిస్థితులు చక్కబడినా కూడా థియేటర్స్‌కి జనాలు వస్తారా అనేది అనుమానమే. అందుకే థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్ తో పాటు నేరుగా ప్రముఖ ఓటీటీలో కూడా రిలీజ్ చేయాలని ప్రభాస్ బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సల్మాన్‌కి ఈ ప్లాన్ వర్కౌట్ అవలేదు. ఇప్పుడు ప్రభాస్‌కి వర్కౌట్ అవుతుందా అనేది అందరిలో కలుగుతున్న పెద్ద సందేహం.


Share

Related posts

బ్రేకింగ్: ఐపీఎల్ 2020కు సురేష్ రైనా దూరం

Vihari

నవ్విపోదురుగాక నాకేటి..: రైతులపై బాబు లేటెస్ట్ లవ్!

CMR

గ్రహాంతరవాసులతో డోనాల్డ్ ట్రంప్ ప్రముఖ సైంటిస్ట్ షాకింగ్ కామెంట్స్..!!

sekhar