Prakash raj: ప్రకాష్ రాజ్‌ని జగపతి బాబు, విజయ్ సేతుపతి డామినేట్ చేస్తున్నారా..అందుకే గతకొంతకాలంగా అవకాశాలు తగ్గాయా..?

Share

Prakash raj: టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీలలో కూడా ఎలాంటి పాత్రైన అలవోకగా చేయగల నటుడు ప్రకాష్ రాజ్. పాత్ర ఎంత కష్టతరమైనది అయినా..ఆయన పోషించడానికి వెనకడుగు వేయరు. ఇక తమ సినిమాలో ప్రకాష్ పాత్ర ఉండాలనుకున్న దర్శక, నిర్మాతలు, హీరోలు ఉన్నారు. తండ్రి, అన్న, మామ, తాతయ్య పాత్రలే కాదు, పోలీస్, రాజకీయ నాయకుడు, విలన్ ఇలా ఎలాంటి విలక్షణమైన పాత్ర కి ఎంచుకున్న వందకి వంద శాతం న్యాయం చేయగల గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలలో దిల్ రాజు..మరో నిర్మాత ఎం.ఎస్.రాజుకి కథ చెప్పినప్పుడు వితౌట్ ప్రకాష్ నువ్వు సినిమా చేయకు అని తేల్చి చెప్పిన సందర్భాలున్నాయి.

is jagapathi babu, vijay setupathi dominating prakash-raj
is jagapathi babu, vijay setupathi dominating prakash-raj

బొమ్మరిల్లు లాంటి సినిమాలో స్టైలిష్ ఫాదర్ అయినా, అంతపురం లాంటి సినిమాలో కఠిన విలన్ గా అయినా, సముద్రం, ఠాగూర్ సినిమాలో అమాయాకమైన కానిస్టేబుల్ పాత్రైనా, చూడాలని ఉంది లాంటి సినిమాలో కన్నింగ్ ఫాదర్ అయినా, ఒక్కడు లాంటి సినిమాలో డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో చేయాలన్నా కేరాఫ్ ప్రకాష్ రాజ్ అని రెండవ ఆలోచన లేకుండా ఫిక్స్ చేసుకున్న మేకర్స్, హీరోలున్నారు. ఒకదశలో ప్రకాష్ రాజ్ డేట్స్ కోసం ప్రాజెక్ట్ కొన్నాళ్ళు పోస్ట్‌పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతగా క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు ఆయన అందుకున్న రెమ్యునరేషన్ కూడా ఓ స్టార్ హీరో రేంజ్‌లో ఉండేది.

Prakash raj: ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అభిమానులు, ప్రేక్షకులు ప్రకాష్ రాజ్‌ని కొట్టే వాడు రాడనే చెప్పుకున్నారు.

అందుకే ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అభిమానులు, ప్రేక్షకులు కూడా ప్రకాష్ రాజ్‌ని కొట్టే వాడు రాడనే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు పరభాషా నటులతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా ఆయనకి గట్టి పోటీ ఇస్తున్నారు. ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌తో ఎంట్రీ ఇచ్చి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అద్భుతమైన పాత్రలను చేస్తూ క్రేజీ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, శ్రీమంతుడు, అరవింద సమేత, నాన్నకు ప్రేమతో, రంగ స్థలం లాంటి సినిమాలతో భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు.

దాదాపు ప్రకాష్ రాజ్ చేయాల్సినవే ఇప్పుడు జగపతి బాబు చేస్తున్నారు. ఒక్క జగపతి బాబు మాత్రమే కోలీవుడ్ విలక్షణ నటులు విజయ్ సేతుపతి, సముద్రఖని, మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ లాంటి వారు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్‌కి దాదాపు అవకాశాలకు తగ్గిపోయాయి. కొన్ని ఫాదర్ రోల్స్, రాజేంద్ర ప్రసాద్ – జగపతి బాబు దక్కించుకుంటున్నారు. అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాలలో సముద్రఖని అదరగొట్టాడు. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ ఫాదర్‌గా నటించి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు.

Prakash raj: ప్రకాష్ రాజ్‌కి చాలామంది పోటీ వచ్చి ఆయనకి అవకాశాలు తగ్గడానికి కారణం అయ్యారు.

దాంతో ఆయనకి ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ మూవీస్ చేసే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. వీరు మాత్రమే కాదు డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇస్తే సీనియర్ హీరోలు అర్జున్ – అరవింద్ స్వామీ లాంటి వారు కూడా మన టాలీవుడ్ మేకర్స్‌కి ఆప్షన్‌గా ఉన్నారు. ఇప్పటికే రాం చరణ్ నటించిన ధృవ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న అరవింద స్వామీ ఆ తర్వాత కూడా అవకాశాలు ఇవ్వాలనుకున్న తెలుగు దర్శక, నిర్మాతలకి తన రెమ్యునరేషన్‌తో షాకిచ్చాడు. ఇక అర్జున్ మాత్రం సినిమాలు చేస్తున్నాడు. ఇలా ప్రకాష్ రాజ్‌కి చాలామంది పోటీ వచ్చి ఆయనకి అవకాశాలు తగ్గడానికి కారణం అయ్యారు.


Share

Related posts

టీకా రాదు..! తిక్క తిక్క ప్రకటనలొద్దు..!!

somaraju sharma

YS Viveka Murder Case: వైఎస్ వివేకా కుమార్తె సునీత సంచలన ఆరోపణలు..కుటుంబ భద్రతకై మరో సారి వినతి..

somaraju sharma

ఆచార్య కథ పూర్తిగా కొరటాల శివదే – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్

Vihari