Siva kartikeyan : శివ కార్తికేయన్‌తో జాతి రత్నాలు డైరెక్టర్ స్ట్రైట్ సినిమా..?

Share

Siva kartikeyan : కోలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ మీద బాగా ఫోకస్ పెట్టారు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయడానికి స్కెచ్ వేసుకుంటున్నారు. మన టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతుంటే కోలీవుడ్ హీరోలు ఇక్కడ ఫోకస్ చేశారు. ఇప్పటికే యంగ్ హీరో ధనుష్, విజయ్ ఇక్కడ స్ట్రైట్ సినిమాలను కమిటయ్యారు. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కోలీవుడ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మన స్టార్ హీరోల అభిమానులు కొందరు దర్శక, నిర్మాతలను ట్రోల్ చేస్తున్నప్పటికీ వీరు అవన్నీ లైట్ తీసుకుంటున్నారు.

is jati rathnalu director straight movie with siva-kartikeyan....?
is jati rathnalu director straight movie with siva-kartikeyan….?

ఇటీవలే ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియన్ సినిమాను శేఖర్ కమ్ముల ప్లాన్ చేశారు. అధికారకంగా ప్రకటన వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో రూపొందనున్న ఈ సినిమాను ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి ముందే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమాను చేయబోతున్నారని ప్రకటించారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. దీనిని పాన్ ఇండియన్స్ సినిమాగా రూపొందించనున్నారు. ఇదే క్రమంలో మరో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Siva kartikeyan : శివ కార్తికేయన్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.

జాతి రత్నాలు సినిమాతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్. ప్రస్తుతం ఆయన జాతి రత్నాలు సినిమాకి సీక్వెల్ రూపొందించనున్నట్టు సమాచారం. అలాగే శివ కార్తికేయన్ హీరోగా ఓ స్ట్రైట్ సినిమాను తెలుగులో ప్లాన్ చేస్తున్నారట. ఇందులో స్టార్ హీరోయిన్‌ని ఫైనల్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. అతను నటించిన తమిళ సినిమాలు తెలుగులోను డబ్ అవుతున్నాయి. ఇక్కడ ప్రేక్షకులకి తన సినిమాల మీద బాగానే ఆసక్తి ఉంది. మరి ఈ హీరోకి టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమాను నిర్మించే వారెవరో త్వరలో వెల్లడికానుంది.


Share

Related posts

MP RRR Case: రఘురామ కేసులో మరో ట్విస్ట్..! సీఐడీ అడిషినల్ డీజీకి లీగల్ నోటీసు..! ఎందుకంటే..?

somaraju sharma

AP CM YS Jagan: ఆ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు  సిద్ధం అవుతున్న సీఎం జగన్..

somaraju sharma

Health: మధ్యాన్నం పూట భోజనం చేసిన తరవాత ఏ పని ఐనా చేయండి కానీ ‘అది’ మాత్రం పొరపాటున కూడా చేయకండి !

bharani jella