Keerthi suresh : అలనాటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు లాంటి వారికి స్టార్ హీరోయిన్స్ చెల్లెలి పాత్రల్లో నటించి మెప్పించారు. అప్పట్లో హీరోలకి చెల్లెలిగా నటించడానికి ఎవరూ అంతగా అడ్డు చెప్పేవారు కాదు. కానీ ఈ తరం హీరోయిన్స్ కొందరు హీరోలకి చెల్లెలి పాత్ర అంటే తమ క్రేజ్ దెబ్బతింటుందని ఒప్పుకోవడం లేదు. ఇప్పటి వారు అలా ఒప్పుకుంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇటీవల నివేతా థామస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూతురుగా నటించింది. ఈ సినిమా ఫ్లాపవడం వల్ల ఆమెకి దర్భార్ సినిమా అంతగా కలిసి రాలేదు.
ఇక కీర్తి సురేష్ రజనీకాంత్ సినిమాలో చెల్లెలి పాత్రలో కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న అన్నాత్తే సినిమాలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా కీలక పాత్రలో నటిస్తున్నారు. ముందు ఈ సినిమాలో కీర్తి సురేష్ ఎంపిక కాగానే అందరు రజనీ కి జంటగా అనుకున్నారు. కానీ ఇందులో కీర్తిది హీరోయిన్ పాత్ర కాదని సమాచారం. కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ ఎంపిక దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని టాక్ వినిపిస్తోంది.
Keerthi suresh : కీర్తి సురేష్ ని మెగాస్టార్ సిస్టర్ రోల్ కి ఒప్పించడానికి ట్రై చేస్తున్నారట.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12 లేదా 13వ తేదీ నుంచి మలయాళ సినిమా లూసీఫర్ రీమేక్ సెట్స్ మీదకి రానుంది. అలాగే తమిళ హిట్ సినిమా వేదాళం కూడా మొదలవనుందని తెలుస్తోంది. ఇందులో చెల్లిలి పాత్ర చాలా కీలకం. తమిళంలో చెల్లెలుగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఆమెకి బాగానే పేరొచ్చింది. అయితే తెలుగులో సాయి పల్లవిని అడిగారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆమె నో చెప్పిందట. దాంతో కీర్తి సురేష్ ని మెగాస్టార్ సిస్టర్ రోల్ కి ఒప్పించడానికి ట్రై చేస్తున్నారట. తాజాగా కీర్తి ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుందట.