Keerthi suresh : కీర్తి సురేష్ సౌత్ సినిమా ఇండస్ట్రీలైన తెలుగు, తమిళంలో బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్. తల్లి హీరోయిన్ అవడం మూలంగా ఈమె చిన్నప్పుడే సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు నటించింది. అప్పుడే కీర్తిని నటన పరంగా ఎంతో పొగిడే వారు. ఆ క్రేజ్ తనని హీరోయిన్ అయ్యేలా మార్చింది. అందంలో..నటనలో తన మార్క్ చూపించింది. అతి కొద్దికాలంలోనే అగ్ర కథానాయిక అనే జాబితాలో కీర్తి చేరింది. మహానటి కి ముందు మహానటి తర్వాత అనేలా ఈమెకి పేరు వచ్చింది.
మహానటి సినిమాకి ముందు అన్నీ కమర్షియల్ సినిమాలని ఎంచుకుంది. దాదాపు ఆమె నటించిన సినిమాలు హిట్ లిస్ట్ లోనే చేరాయి. తెలుగులో రాం తో నేను శైలజ, నాని తో నేను లోకల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం తీసిన అజ్ఞాతవాసి సినిమాలు నటించింది. అయితే ఆనాటి కథానాయిక సావిత్రి జీవిత కథను మహానటి పేరుతో తెరకెక్కించగా ఆ టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ నటించి సినీ, రాజకీయ నాయకుల యొక్క ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత తను నటించే సినిమాలతో బాగా క్రేజ్ పెరిగింది.
Keerthi suresh : గుడ్ లక్ సఖి తో ఫ్యూచర్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కమిటవ్వాలా లేదా తేలిపోతుంది.
మహానటి సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల వరుసగా సినిమాలు చేసే అవకాశం అందుకుంది. పెంగ్విన్, ఆ తర్వాత మిస్ ఇండియా అనే సినిమాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలుగా వచ్చాయి. కానీ ప్లాయ్ టాక్ తో చతికిల పడిన సంగతి తెలిసిందే. అప్పుడే రావాల్సిన మరో లేడీ ఓరియెంటెడ్ నగేష్ కుకునూర్ దర్శకత్వ వహించిన గుడ్ లక్ సఖి త్వరలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఓటీటీలో గుడ్ లక్ సఖిని తీసుకు వస్తున్నారని సమాచారం. ఈ సినిమా మీద కీర్తి కొంతవరకు నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయ్యే దాన్ని బట్టి ఫ్యాచర్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కమిటవ్వాలా లేదా తేలిపోతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?