ప్రస్తుతం కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఒప్పుకుంటుంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలు ఆ జాబితాలో తయారవుతున్నవే. ఈ సినిమాలలో ఇప్పటికే పెంగ్విన్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా కీర్తి నటించిన మరో సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన “గుడ్ లక్ సఖి” సినిమాకు ఎక్కువమంది లేడీ టెక్నీషియన్స్ పని చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తుండగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి షాకిచ్చింది. అయితే కీర్తి సురేష్ ఇలాంటి పాత్రలో కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుందని సమాచారం.